News
News
X

Jharkhand Murder: ఝార్ఖండ్‌లో మహిళ దారుణ హత్య, శరీరాన్ని 18 ముక్కలు చేసిన నిందితుడు

Jharkhand Murder: ఝార్ఖండ్‌లో ఓ వ్యక్తి తన రెండో భార్యను దారుణంగా నరికి చంపాడు.

FOLLOW US: 
Share:

Jharkhand Murder:

పదునైన ఆయుధంతో హత్య..? 

ఝార్ఖండ్‌లో శ్రద్ధ తరహా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సాహిబ్‌గంజ్‌ జిల్లాలో గిరిజన తెగకు చెందిన ఓ వ్యక్తి తన రెండో భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు.  శవాన్ని 18 ముక్కలు చేశాడు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు మరి కొన్ని వివరాలు వెల్లడించారు. "22 ఏళ్ల మహిళ మృత దేహానికి సంబంధించిన 12 శరీర భాగాలను గుర్తించాం. తలతో సహా మిగతా శరీర భాగాలు ఇంకా దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుడు దిల్దార్ అన్సారీని అదుపులోకి తీసుకున్నాం" అని చెప్పారు. సంతాలి మోమిన్ తోల ప్రాంతంలో కొన్ని శరీర భాగాలు గుర్తించామని స్పష్టం చేశారు. బాధితురాలు రూబికా పహదిన్‌...నిందితుడికి రెండో భార్య అని తెలిపారు. రెండేళ్లుగా వీళ్లిద్దరి మధ్య పరిచయం ఉందని,మృతురాలి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. విచారణలో భాగంగా...రూబికా హత్యకు గురైందని తేలింది. శవాన్ని కట్ చేసేందుకు ఎలక్ట్రిక్ కట్టర్‌ లాంటి పదునైన ఆయుధాన్ని వినియోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అటు రాజకీయంగానూ ఈ ఘటనపై పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో  విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. "హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో బాలికలు, యువతులపై ఇలాంటి దారుణాలెన్నో జరుగుతున్నాయి. మైనార్టీ వర్గానికి చెందినకొందరు వ్యక్తులు కావాలనే మహిళలపై ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కదలిక లేకుండా ఉంటే...మేమే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటాం" అని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ అన్నారు. 

Published at : 18 Dec 2022 02:22 PM (IST) Tags: murder Jharkhand Jharkhand Murder

సంబంధిత కథనాలు

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్

Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపూనకు జీవిత ఖైదు విధించిన గుజరాత్ కోర్ట్

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపూనకు జీవిత ఖైదు విధించిన గుజరాత్ కోర్ట్

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ