అన్వేషించండి

Pawan Kalyan: అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ ముజామిల్ అరెస్ట్.. కింగ్ పిన్స్ వేట మొదలైంది: పవన్ కళ్యాణ్

శేషాచలం నుంచి బెంగళూరు మీదుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్‌ను ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Red Sandalwood Smuggling | చిత్తూరు: ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల వేట మొదలైందని, వారి వెనకున్న కింగ్ పిన్‌లను సైతం త్వరలో ఏరివేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్‌ను ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ టీమ్ అరెస్టు చేసింది. ఈ కింగ్ పిన్ ఎర్రచందనం దుంగలను లైసెన్స్ పేరు చెప్పి అక్రమంగా చైనాకి తరలించేవాడు. శేషాచలం నుంచి బెంగళూరు మీదుగా రవాణాకు పాల్పడేవాడు. ముజామిల్ మీద గతంలోనే అనేక కేసులు ఉండగా, 87 శాతం కేసుల్లో శిక్షలు కూడా ఖరారయ్యాయి. అయితే అప్పటి నుంచి ఇతడు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ పై కూటమి సర్కార్ ఉక్కుపాదం..

ఎర్ర చందనం స్మగ్లర్లు, వారి వెనక ఉన్నవారిపై ఉక్కు పాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ బృందం కింగ్ పిన్స్ వేట మొదలుపెట్టింది. ఈ వేటలో భాగంగా శనివారం ఉదయం చిత్తూరు - నాయుడుపేట జాతీయ రహదారిపై అడిషనల్ ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలోని బృందం ముజామిల్‌ను పట్టుకుంది.

చైనా కంపెనీలతో లింకులు

విచారణలో ఇతనికి చైనాలోని జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. ఎర్రచందనం అక్రమ రవాణాకి పాల్పడే వారి పట్ల ప్రభుత్వం నిర్ధయగా వ్యవహరిస్తుందని, కింగ్ పిన్స్ ఎవరైనా ఉంటే లొంగిపోవాలని గత చిత్తూరు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కింగ్ పిన్స్ ఏ మూలన దాగి ఉన్నా పట్టుకుంటామని అప్పట్లోనే స్పష్టం చేశారు. ఆ ఆదేశాల మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన యాంటి రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ బృందం మొదటి విజయం సాధించింది.

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్ లక్ష్య సాధనలో ఇది కీలక అడుగు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ హెడ్ ఎస్పీ సుబ్బారాయడు, అడిషనల్ ఎస్పీ కులశేఖర్, ఇతర సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదే విధంగా ఎర్రచందనం స్మగ్లర్లు, వారి వెనకున్న కింగ్ పిన్‌లను త్వరలో అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget