అన్వేషించండి

Ambati vs TDP: అంబటి రాంబాబుకు టీడీపీ అల్టిమేటం! 24 గంటల్లో చంద్రబాబుకు క్షమాపణ చెప్పకుంటే గుంటూరులో తిరగలేరని వార్నింగ్!

Ambati vs TDP: సీఎం చంద్రబాబును బూతులు తిట్టిన వైసీపీ లీడర్‌ అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Ambati vs TDP: గుంటూరులో రాజకీయాలు మరింత హీటెక్కాయి. లడ్డూతో మొదలైన ఘర్షణలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. టీడీపీ, వైసీపీ పోటాపోటీ నినాదాలు, నిరసనలతో హోరెత్తిపోతోంది. సవాళ్లు ప్రతిసవాళతో మిర్చి నగరం ఘాటెక్కిపోతోంది. తనను అడ్డుకున్నారని టీడీపీ నేతలు, చంద్రబాబుపై బూతులతో రెచ్చిపోయారు.
 
సీఎం చంద్రబాబును బూతులు తిట్టిన వైసీపీ లీడర్‌ అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ నేతను బూతులు తిట్టిన అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆ పని తామే చేస్తామని హెచ్చరించారు. తాము తలచుకుంటే వైసీపీ నేతలు గుంటూరులో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. అసలు గుంటూరులో వైసీపీ ఆఫీసే లేకుండా చేస్తామని అన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్స్‌కు 24 గంటల్లో అంబటి క్షమాపణలు చెప్పకపోతే ఆయన్ని గుంటూరులో తిరగకుండా చేస్తామని చెప్పారు. 

మరోవైపు వైసీపీ నేతలు చేస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని మంత్రులు, టీడీపీ నేతలు అన్నారు. పవిత్రమైన తిరుపతి లడ్డూను కల్తీ చేయడమే కాకుండా ఇప్పుడు తామేదో నిర్దోషులమనే రేంజ్‌లో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. మీడియాతో మాట్లాడిన మంత్రి పయ్యావుల కేశవ్ " భక్తులకు నాణ్యమైన లడ్డూ అందించాలని నెయ్యి సరఫరా కోసం టీటీడీ కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది. నెయ్యి సరఫరా చేసే వారికి పాడిపరశ్రమలో మూడేళ్ల అనుభవం ఉండాలి. రూ.250 కోట్ల టర్నోవర్ ఉండాలి. నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరించాలనే నిబంధన పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ నిబంధనలు సడలించినప్పుడే అవినీతికి బీజం పడింది. లడ్డూ నాణ్యత లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం ఆందోళనలు చేశాం. దేవదేవునికి భక్తితో సేవ చేయాల్సింది పోయి ధనార్జనే లక్ష్యంగా దోచుకున్నారు. నెయ్యి కల్తీ జరిగిందని 2022లోనే తేల్చారు. 2022లో ఇచ్చిన రిపోర్ట్ తొక్కిపెట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కల్తీ జరిగిందని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలి." అని డిమాండ్ చేశారు. 

అప్పుడే చర్యలు ఎందుకు తీసుకోలేదని పయ్యావుల ప్రశ్నించారు. దేవదేవుడి పట్ల నమ్మకం లేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. "2022లో చిన్నప్పన్న అనే వ్యక్తి బోలేబాబా డెయిరీని సంప్రదించారు. వైవీ సుబ్బారెడ్డికి పీఏగా పనిచేసిన చిన్నప్పన్న డెయిరీని సంప్రదించారు. లీటరుకు రూ.25 ఇవ్వాలని అడిగారు. వాళ్లు ఒప్పుకోలేదు. నిబంధనల్లోకి రారని సర్టిఫికెట్ ఇప్పించి. వాళ్లను డిస్ క్వాలిఫై చేయించారు. ఇతర మార్గాల్లో కంపెనీల పేర్లు మార్చి దుర్మార్గానికి ఒడిగట్టారు. తమ ఇంటిదైవంగా వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు కొలుస్తారు. 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. తిరుమల ప్రక్షాళనకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు . అప్పుడే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చింది." అని వివరించారు. 
 
లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని NDDB రిపోర్టులో స్పష్టంగా ఉందన్నారు పయ్యావుల. సిట్ ఇచ్చిన నివేదికలోని 35వ పేజీ చూస్తే వాస్తవాలు అర్థమవుతాయన్నారు. "6-7-24, 23-7-24 రిపోర్టులు వచ్చాయని సిట్ చెప్పింది. రెండు రిపోర్ట్‌ల్లోనూ విజిటబుల్ ఆయిల్స్ జంతువుల కొవ్వు ఉందని NDDB చెప్పినట్లు సిట్ నిర్ధారించింది. వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి. వెంకటేశ్వర స్వామిపట్ల వైసీపీ నేతలకు నమ్మకం లేదని తేలిపోయింది. నాడు ముఖ్యమంత్రి సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించలేదు. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను పట్టించుకోలేదు. కల్తీ కుట్ర వెనకున్న సూత్రధారి ఎవరో తేలాలి. కల్తీ నెయ్యి వ్యవహారంపై 2022లో CFTRI రిపోర్టు ఇచ్చింది. CFTRI రీపోర్టును నాటి జగన్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత CFTRI రిపోర్టు వెలుగులోకి వచ్చింది. జంతువుల కొవ్వు ఉందని సిట్ ఛార్జ్ షీట్‍లో స్పష్టంగా ఉంది. అయినా గుళ్లు కడుగుతాం, మెట్లు కడుగుతాం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. టాలో(కొవ్వు), ఫిష్ ఆయిల్ లేదని ఏ నివేదిక చెప్పిందో వైసీపీ నేతలు చెప్పాలి" అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. 

సనాతన ధర్మం పట్ల వైసిపికి నమ్మకం ఉందా? అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి అంటే జగన్మోహన్ రెడ్డికి భయం లేదు, భక్తి లేదన్నారు. "ప్రజలకు వెంకటేశ్వరస్వామి అంటే ఎంతో భక్తి, సెంటిమెంట్. ప్రజలు మనోభావాలను దెబ్బతీశారు. ఇప్పటికైనా ప్రజలను క్షమించమని అడగండి.  చేసిన తప్పులను తప్పించుకోవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విదేశాల్లో ఉండేవారు కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఎంతగానో పూజిస్తారు. తిరుపతి ప్రసాదం విషయంలో కోట్ల రూపాయలు నొక్కేశారు. ప్రజలు కూడా గమనించాలి. సొంత బాబాయిని చంపారు. బాబాయి కూతురు న్యాయం కోసం పోరాడుతుంది.పాల సరఫరా లేని వారికి కూడా టెండర్లు ఇచ్చారు. వైసీపీ వాళ్లు మూర్ఖులు.. ప్రజలన్నీ ఆలోచించాలి. 20 లక్షల కోట్ల లడ్డుల్ని కల్తీ చేశారు." హోం మంత్రి అనిత.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget