అన్వేషించండి

AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం

వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల పేపర్లను ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించి, అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీఎం చంద్రబాబు APPSC గ్రూప్-1 అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
  • ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లతో పేపర్లు దిద్దించి, కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారు.
  • అక్రమాలు అభ్యర్థుల జీవితాలు నాశనం చేయగా, సీఎం పారదర్శకత హామీ.

అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో చోటుచేసుకున్న తీవ్ర అక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరకు గ్రూప్-1 స్థాయి అధికారులను ఎంపిక చేసే ఎగ్జామ్ పేపర్లను ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించి, అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 344 నిబంధన కింద జరిగిన ప్రత్యేక చర్చలో భాగంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం అత్యంత పారదర్శకంగా పనిచేయాల్సిన ఏపీపీఎస్సీని గత పాలకులు నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు ఎంతో కీలకమైన గ్రూప్-1 అధికారులను ఎంపిక చేసే ఈ వ్యవస్థలో, అభ్యర్థులు రాత్రింబవళ్లు శ్రమించి ఉద్యోగాలు సాధించడానికి ప్రయత్నిస్తే, వారి భవిష్యత్తుతో బరితెగించి ఆడుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ అనేది ప్రజలకు జవాబుదారీతనంతో విషయాలు వెల్లడించే ప్రాథమిక వేదిక కాబట్టి, ఈ విధ్వంసాన్ని ప్రజా క్షేత్రంలో స్పష్టంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం ప్రారంభం..

2019 నుండి 2024 మధ్య కాలంలో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను మాత్రమే కాకుండా, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని సైతం పూర్తిగా దెబ్బతీసిందని సీఎం విమర్శించారు. 2018లో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు దాదాపు 1.14 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 325 మందిని షార్ట్‌లిస్ట్ చేయడం జరిగింది. సాధారణంగా పదో తరగతి పరీక్ష పత్రాలను కూడా పోలీసు ఎస్కార్ట్‌తో అత్యంత భద్రంగా తరలిస్తుంటే, రాష్ట్రాన్ని పాలించే ఉన్నతాధికారుల ఎంపిక పరీక్ష విషయంలో అన్ని నిబంధనలను గాలికి వదిలేసి తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైకోర్టు డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కన పెట్టి మాన్యువల్ మూల్యాంకనం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కోర్టును తప్పుదోవ పట్టిస్తూ అసత్య అఫిడవిట్లు సమర్పించారని దుయ్యబట్టారు. న్యాయస్థానం ఉత్తర్వుల తర్వాత అయినా పరిస్థితిని సరిదిద్దాల్సింది పోయి, మరొక కేసులో సీఐడీ స్వాధీనంలో ఉన్న 'హాయ్ లాండ్' కేంద్రంగా మాన్యువల్ ఎవాల్యుయేషన్ నిర్వహించేందుకు రూ.1.19 కోట్లకు జీవో జారీ చేశారని వెల్లడించారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, ప్రైవేటు వ్యక్తులకు పేపర్ వాల్యుయేషన్ బాధ్యతలను అప్పగించారని ధ్వజమెత్తారు. 

Frequently Asked Questions

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో గుర్తించిన ప్రధాన అక్రమాలు ఏమిటి?

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు వంటి అనర్హుల చేత పేపర్లను దిద్దించి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆరోపణలున్నాయి.

ఈ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏమిటి?

భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం APPSC పారదర్శకంగా పనిచేసేలా చూస్తామన్నారు.

మూల్యాంకనం విషయంలో APPSC హైకోర్టు ఆదేశాలను ఎలా ఉల్లంఘించింది?

డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కన పెట్టి మాన్యువల్ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించినా, కోర్టును తప్పుదోవ పట్టించి అసత్య అఫిడవిట్లు సమర్పించారు. సీఐడీ స్వాధీనంలోని 'హాయ్ లాండ్'లో ప్రైవేటు వ్యక్తులతో మాన్యువల్ ఎవాల్యుయేషన్ నిర్వహించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
Breaking News: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు,సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Embed widget