అన్వేషించండి

Instagram Love Tragedy: ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య

Woman and Lover Commit Suicide in Eluru | ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ప్రేమగా మారింది. వివాహితను ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తమను వీడదీస్తున్నారని ఇద్దరూ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

ఉంగుటూరు: సోషల్ మీడియా పరిచయం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి, చివరకు ఆత్మహత్యకు దారితీసింది. ఈ ఘటనలో కన్నబిడ్డలను, భర్తను వదిలేసి వచ్చిన ఒక మహిళ, తన ప్రియుడితో కలిసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఏలూరు జిల్లాలో ఈ విచిత్రకరమైన ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే..
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామ సమీపంలోని యర్రమళ్లకు చెందిన మావుళ్లయ్యకు, శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన రమతో రెండేళ్ల కిందటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. రమకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ వీరిద్దరి ఇన్‌స్టా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరకు వివాహేతర సంబంధానికి దారితీయడంతో సమస్య మొాదలైంది. ఇటీవల రమ తన కుటుంబాన్ని వదిలి మావుళ్లయ్య ఊరికి వచ్చేసింది. అక్కడ వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న రమ కుటుంబ సభ్యులు యర్రమళ్లకు వచ్చి గొడవ పడటంతో పాటు, ఆమెను బలవంతంగా సొంత ఊరు యర్రమళ్లకు తీసుకెళ్లారు.

కాలువలో దూకి ఆత్మహత్య

కుటుంబ సభ్యులు తీసుకెళ్లినప్పటికీ, తన ప్రియుడ్ని విడిచి ఉండలేక రమ మళ్లీ తిరిగి రావడంతో మావుళ్లయ్య ఆమెను సీక్రెట్‌గా ఉంగుటూరులో ఓ గదిలో ఉంచాడు. ఈ నెల 24న తన అన్న కుమారుడు సతీష్2కు ఫోన్ చేసి రమ వచ్చిన విషయం చెప్పిన మావుళ్లయ్య, అక్కడికి వస్తే ఏం చేయాలో మాట్లాడదాం అని పిలిచాడు. ఆ తర్వాత ఆమెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నాన్న మావూళ్లయ్యను కలిసేందుకు వచ్చిన సతీష్‌కు నాచుగుంట కాలువ గట్టుపై మావుళ్లయ్య వస్తువులు కనిపించడంతో అనుమానం వచ్చి బంధువులతో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం మావుళ్లయ్య మృతదేహం లభ్యమైంది.

రమ కూడా కనిపించడం లేదని, ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని భావించి ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో గాలించగా చేబ్రోలు సమీపంలో రమ మృతదేహం లభ్యమైంది. ఈ ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఈ ఘటనతో అటు మావుళ్లయ్య తల్లిదండ్రులు కుమారుడు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇటు రమ ఇద్దరు చిన్నారులు తల్లిలేని వారయ్యారు. సోషల్ మీడియాలో ఏర్పడే అపరిచిత బంధాలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget