అన్వేషించండి

Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య

తనకు హెచ్ఐవీ సోకిందని పెళ్లికి నిరాకరించడంతో యువతికి సైతం వైరస్ ఇంజెక్షన్ ఇచ్చాడు. మనస్తాపానికి లోనై యువతి ఆత్మహత్య చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లో ఇటీవల ఓ యువకుడు తన ప్రియురాలికి హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు యువతికి బలవంతంగా హెచ్‌ఐవీ (HIV) సోకిన రక్తాన్ని ఎక్కించగా, ఆ మనస్తాపంతో బాధిత యువతి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  చిన్ననాటి నుంచి ప్రేమించిన వ్యక్తే తన జీవితాన్ని ఇలా నాశనం చేశాడన్న బాధతో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే..
జనగామ జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ట్రాన్స్‌పోర్ట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతడి తల్లిదండ్రులిద్దరికీ హెచ్‌ఐవీ పాజిటివ్ ఉండగా, తండ్రి గతంలోనే మరణించాడు. సమీప బంధువైన యువతిని అతడు ప్రేమించగా, పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించారు. అయితే, వివాహానికి ముందు యువతి తండ్రి జరిపించిన రక్త పరీక్షల్లో యువకుడికి కూడా హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు. కుమార్తె జీవితాన్ని తెలిసి నాశనం చేయలేమని, యువకుడి కుటుంబానికి వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

వివాహం రద్దవడాన్ని జీర్ణించుకోలేకపోయిన నిందితుడు, తాను ప్రేమించిన యువతికి కూడా హెచ్‌ఐవీ సోకితే మరెవరూ పెళ్లి చేసుకోరని, అప్పుడు కచ్చితంగా తననే చేసుకుంటుందని వికృతంగా ఆలోచించాడు. మార్చి నెల 11న తన రక్తాన్ని సిరంజీలోకి తీసుకుని, యువతి ఇంటికి వెళ్లి ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఆ రక్తాన్ని ఎక్కించి పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ప్రాణాంతక వ్యాధి సోకిందన్న ఆందోళన, సమాజంలో ఎదురయ్యే అవమానం తట్టుకోలేక ఆ యువతి ప్రాణాలు తీసుకోవడం అందర్నీ కలచివేస్తోంది. తన తప్పు లేకున్నా, ఆమె చనిపోయిందని తెలియడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

మనుషులు ఇంత దారుణంగా ఆలోచిస్తారా? 

ఈ ఘటనలో ఆ యువకుడు దారుణమైన తప్పిదం చేశాడు. ప్రేమించిన యువతి హాయిగా ఉండాలని ఆలోచించలేదు. తన కుటుంబంతో పాటు తనకు హెచ్ఐవీ ఉందని గమనించి సైలెంట్ గా ఉండలేదు. అదే కారణంతో తనను రిజెక్ట్ చేయడం, పెళ్లి రద్దు కావడంతో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రమాదకర హెచ్ఐవీ రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. అలా చేస్తే ఆమె నిజంగానే అతడ్ని పెళ్లి చేసుకుంటుందా? నేరస్తుడిగా జైలుకు వెళ్తానని మాత్రం ఆలోచించలేకపోయాడు. ఆ అవమాన భారంతోనో, లేక భయంతోనే యువతి ఏదైనా తీసుకోకూడదని నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏంటని కూడా థింక్ చేయలేదు. అతడి వికృత నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆ తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిల్చించింది. పెళ్లి చేసి అత్తింటికి పంపాలని భావించిన తల్లిదండ్రులు కూతుర్ని శ్మశానానికి సాగనంపి, ఆమెకు తుది వీడ్కోలు పలకాల్సి రావడం కంటే నరకం ఇంకేమైనా ఉంటుందా అని స్థానికులు, నెటిజన్లు అంటున్నారు. తనకు దక్కనిది ఎవరు దక్కకూడదని భావించే వాళ్లు, దక్కించుకునేందుకు ఏదైనా పిచ్చి పనులు చేస్తే వారికి కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget