అన్వేషించండి

Ysrcp Leader R Krishnaiah : వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు, నయీమ్ పేరుతో బెదిరించారని ఫిర్యాదు!

Ysrcp Leader R Krishnaiah: వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్యపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తన భూమి కజ్జా చేసేందుకు కృష్ణయ్య ప్రయత్నిస్తున్నారని రవీందర్‌ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుచేశారు.

Ysrcp Leader R Krishnaiah : వైసీపీ రాజ్యసభ అభ్యర్థి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై హైదరాబాద్ లో పోలీస్ కేసు నమోదు అయింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆర్.కృష్ణయ్యపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదైంది. తన భూమి కబ్జా చేసేందుకు నయీమ్ పేరు చెప్పి బెదిరిస్తున్నారని రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీలు, గూండాలతో బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. భూకబ్జాతో పాటు హత్యకు ప్రయత్నించారని రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆర్‌ కృష్ణయ్యపై 447, 427, 506, 384 రెడ్‌డబ్యూ 34 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 

అసలేం జరిగింది?

వైసీపీ రాజ్యస‌భ అభ్యర్థిగా నామినేష‌న్ వేసిన ఆర్.కృష్ణయ్యపై కేసు న‌మోదైంది. హైద‌రాబాద్‌కు చెందిన ర‌వీంద‌ర్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచారించిన కోర్టు జారీ చేసిన ఆదేశాల‌తో హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో ఆర్‌.కృష్ణయ్యతో పాటు మ‌రికొంద‌రిపై కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసు వివ‌రాల్లోకి వెళితే హైద‌రాబాద్ ప‌రిధిలోని త‌న భూమిని ఆర్.కృష్ణయ్య క‌బ్జా చేశార‌ని రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. త‌న భూమిని కబ్జా చేయ‌డంతో పాటుగా త‌న‌ను చంపేందుకు కూడా కృష్ణయ్య య‌త్నించార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ క్రమంలో కొంద‌రు రౌడీల‌ను పంపి త‌న‌ను బెదిరిస్తున్నార‌ని ఆయ‌న ఆర్.కృష్ణయ్యపై కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. ఇవే ఆరోప‌ణ‌ల‌తో ర‌వీంద‌ర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఆర్.కృష్ణయ్యపై కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

నాన్ బెయిలబుల్ కేసు 

కోర్టు ఆదేశాల ఆధారంగా ఆర్.కృష్ణయ్య స‌హా మ‌రికొంద‌రిపై రాయ‌దుర్గం పోలీసులు నాన్ బెయిల‌బుల్ సెక్షన్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఈ మేర‌కు ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఏపీ కోటా నుంచి వైసీపీ రాజ్యస‌భ అభ్యర్థిగా ఇటీవ‌లే ఆర్.కృష్ణయ్య నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు శుక్రవారంతో గ‌డువు ముగియ‌నుంది. మొత్తం 4 స్థానాల‌కు 4 నామినేష‌న్లే వ‌చ్చిన నేప‌థ్యంలో శుక్రవారం ఆర్.కృష్ణయ్య స‌హా వైసీపీ అభ్యర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రక‌టించే అవ‌కాశాలున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిల‌బుల్ సెక్షన్ల కింద కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Rich Beggar Died : కాకినాడలో యాచకుడి మృతి - ఇంట్లో రూ. రెండు లక్షలు - బంధువులెవరైనా ఉన్నారా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget