అన్వేషించండి

Rich Beggar Died : కాకినాడలో యాచకుడి మృతి - ఇంట్లో రూ. రెండు లక్షలు - బంధువులెవరైనా ఉన్నారా ?

కాకినాడలో యాచకుడు మృతి చెందాడు. ఆయన ఇంట్లో రూ. రెండు లక్షల నగదు బయటపడింది.


Rich Beggar Died :కాకినాడలో ఓ యాచకుడు హఠాత్తుగా చనిపోయాడు. నా అన్నవారు లేరు. దీంతో స్థానికులే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మున్సిపాలిటీ వారికి సమాచారం ఇచ్చారు. ఆ యాచకుడికి సంబంధించిన సమాచారం ఏమైనా దొరుకుతుందేమోనని ఆయన ఉంటున్న చిన్న గది మొత్తంవెదికారు. అయితే వారికి అలాంటి సమాచారం ఏదీ దొరకలేదు కానీ.. గదిలో ఎక్కడ చూసినా డబ్బులే కనిపించాయి. అన్నీ యాచన చేసి సంపాదించుకున్నవే. రూ. రెండు ,  లక్షల వరకూ ఉంటాయని గుర్తించారు. 

వేళంగికి వచ్చి యాచకునిగా బతుకుతున్న రామకృష్ణ

రామకృష్ణ అనే వ్యక్తి కొన్నాళ్ల కిందట వేళంగి గ్రామానికి వచ్చాడు. నా అనేవాళ్లు ఎవరూ లేకపోవడంతో భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు. జనాలకు రక్ష రేకులు కడుతూ ఉంటాడు. దాంతో చాలా మందికి రామకృష్ణ అంటే ముఖ పరిచయం. ఎప్పుడూ కనిపించే వ్యక్తి కాబట్టి... తమ దగ్గర ఉన్నప్పుడు జనాలు పదో పరకో ఇస్తూ ఉండేవారు. అక్కడే చిన్న రూమ్ లో రామకృష్ణ ఉంటూంటాడు. సత్రాల్లోనో.. గుళ్లలోనే ఎక్కడైనా భోజనాలు పెడితే తిని బతుకు ఈడుస్తూ ఉంటాడు. 

యాచన చేసిన డబ్బులన్నీ గోతాల్లో భద్రం

చేపల మార్కెట్‌ సమీపంలో గదిలో ఆయన ఉంటూ ఉంటాడు. అయితే హఠాత్తుగా రామకృష్ణ చనిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణకు సంబంధించిన వివరాల కోసం రూమ్‌లో వెదికారు. ఆ వివరాలేమీ దొరకలేదు కానీ.., తనిఖీలో నోట్ల సంచులు వెలుగుచూశాయి. ఆ సంచుల నిండా నోట్ల కట్టలు, చిల్లర నాణేలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో గ్రామస్థులు డబ్బులను లెక్కించారు. మొత్తంగా సుమారు రూ.2 లక్షల వరకు డబ్బు బయటపడింది. ఈ నోట్ల కట్టల సంచులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఇప్పుడు రామకృష్ణ బంధువులెవరైనా వస్తారా ?

రామకృష్ణకు డబ్బు అవసరం ఉండేది కాదు. కానీ యాచకం తన వృత్తి అందుకే అలా వృత్తి చేసుకుంటూనే ఉన్నాడు. వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త చేసుకుంటూనే ఉన్నాడు. వాటిని ఏం చేసుకోవాలో ఆయనకు తెలియదు. పట్టించుకోలేదు. అయితే అసలు ఇంతకీ రామకృష్ణ ఎవరు ? ఎవరికీ తెలియదు కానీ ఆయనకు సంబంధించిన వాళ్లు ఎక్కడో ఉంటారు. ఆయన భారం భరించలేక వదిలేసి ఉంటారు.కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన రూ. రెండు లక్షలు పోలీసుల దగ్గర ఉన్నాయని తెలిస్తే వారు రాకుండా ఉంటారా ? వారి కోసమే పోలీసుల వెయిటింగ్. 

టాప్ హెడ్ లైన్స్

AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Fishermen Boat Capsized: విశాఖ తీరంలో బోటు బోల్తా.. తృటిలో తప్పించుకున్న ఏడుగురు మత్స్యకారులు
విశాఖ తీరంలో బోటు బోల్తా.. తృటిలో తప్పించుకున్న ఏడుగురు మత్స్యకారులు
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
Tollywood Fans Political Agenda: ఫ్యాన్స్ పేరుతో హీరోల ఇమేజ్‌తో ఆట - రాజకీయం కొత్త దిశలో వెళ్తోందా?
ఫ్యాన్స్ పేరుతో హీరోల ఇమేజ్‌తో ఆట - రాజకీయం కొత్త దిశలో వెళ్తోందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget