Rachakonda Crime News : అరకు టు హైదరాబాద్ గంజాయి రవాణా, నలుగురు నిందితుల అరెస్టు
Rachakonda Crime News : ఏపీ నుంచి హైదరాబాద్, ముంబయికి గంజాయిని తరలిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మారుతీ కారు, ఆటోల్లో గంజాయి రవాణా చేస్తున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
Rachakonda Crime News : ఆంధ్రప్రదేశ్ అరకు(Araku) నుంచి హైదరాబాద్(Hyderabad) కు గంజాయి, హాశిష్ ఆయిల్ తరలిస్తున్న నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్(Mahesh Bhagwat) తెలిపారు. అరకులో తక్కువ రేటుకు కొని హైదరాబాద్ లో ఎక్కువకు అమ్ముతున్నారన్నారు. నిందితులు మారుతీ షిఫ్ట్ కార్ లో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. నిందితుల నుంచి 120 కిలోల గంజాయి, 2 లీటర్ల హాష్ ఆయిల్, ఒక కార్, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అరకుకు చెందిన వెంకట్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామన్నారు. గంజాయి(Ganja) రవాణాలో హైదరాబాద్ చింతల్ కు చెందిన నరసింహాచారి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఇతను పాత నేరస్తుడని, గతంలో ఇతనిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కూడా కేసులు నమోదు అయ్యాయన్నారు. మొత్తం 8 మంది నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారన్నారు.
#Illegal transporting of contraband #Ganja from #Chintur, #EastGodavari of AP to #Mumbai #Maharashtra via #Zaheerabad of #Telangana state in an auto & #arrested one person by #SOT_Malkajgiri, & #seized 102 kgs of ganja & one auto from his possession, all worth about Rs.20,50,000. pic.twitter.com/oRBmqHmcV3
— Rachakonda Police (@RachakondaCop) March 14, 2022
మరో కేసులో 102 కిలోల గంజాయి పట్టివేత
మరో కేసులో తూర్పు గోదావరి చింతూర్ నుంచి తెలంగాణ మీదుగా ముంబయికి గంజాయి రవాణా చేస్తున్న ఆటో వాలాను అరెస్ట్ చేశామని సీపీ మహేష్ భగవత్ అన్నారు. నిందితులు గంజాయిని ఏపీ నుంచి తెలంగాణ జహీరాబాద్ మీదుగా కర్ణాటక, మహారాష్ట్రకు చేరవేస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన బదవత్ రవి అనే ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేశామన్నారు. చింతూరుకు చెందిన సురేష్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. మొత్తం ఐదుగురు నిందితుల్లో నలుగురు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితుల నుంచి 102 కిలోల గంజాయి, ఒక ఆటో, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.