Hyderabad: కొన్నేళ్లుగా సహజీవనం, అతని కోరికను ఒప్పుకోని ఆమె.. చివరికి దారుణం

తనతో సహజీవనం కొనసాగించడం లేదనే అక్కసుతో ఓ మహిళపై పెట్రోల్‌ పోసి ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

FOLLOW US: 

పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధాలు, సహజీవనాలు చివరికి ఎలాంటి అనర్థాలకు దారి తీస్తాయో చాటే మరో ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. సహజీవనం చేయాలని బలవంతం చేయగా ఓ మహిళ ఒప్పుకోనందుకు ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. వయసు పైబడిన స్థితిలో ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలివీ..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తనతో సహజీవనం చేయడం లేదనే అక్కసుతో ఓ మహిళపై పెట్రోల్‌ పోసి ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. కూకట్‌ పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన 50 ఏళ్ల మహిళ, ఇద్దరు పిల్లలతో కలిసి జగద్గిరి గుట్టలో నివాసం ఉంటోంది. ఆమెకు కడపకు చెందిన వెంకటేశ్వర్లు అనే 55 ఏళ్ల వ్యక్తితో కొద్ది సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. వీరు ఇద్దరు కొంత కాలం నుంచి సహజీవనం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె స్థానికులతో మాట్లాడుతున్న సందర్భాల్లో ఆమెను ఇతను అనుమానించేవాడు. సూటిపోటి మాటలతో తరచూ వేధించేవాడు. ఆ వేధింపులు భరించలేక ఆమె కూకట్‌ పల్లి ప్రకాష్‌ నగర్‌లోని మరో ఇంటికి మారింది. వెంకటేశ్వర్లు అక్కడికి కూడా వచ్చి ఆమె ఉంటున్న చోటుకు వచ్చి తనతోనే కలిసి ఉండాలని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు.

ఎన్నిసార్లు కోరినా మహిళ ఒప్పుకోకపోవడంతో ఆమెపై వెంకటేశ్వర్లు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్రమైన కాలిన గాయాలతో మహిళ అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. ఇంట్లోనే కాలిపోవడంతో మంటలు వెంకటేశ్వర్లుకు కూడా అంటుకున్నాయి. దీంతో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మంటల్లో కాలిపోతున్న సమయంలో ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడాన్ని స్థానికులు గమనించారు. హుటాహుటిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపు తలుపులు పగల కొట్టి గాయాలపాలైన నిందితుడిని సమీపంలోని అస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి... ఫస్టియర్ లో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య ..!

Read Also: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం

Also Read: మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 23 Dec 2021 10:43 AM (IST) Tags: Hyderabad murder extramarital affair Man murders woman Kukatpally murder living together in hyderabad

సంబంధిత కథనాలు

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !

DK SrinivaS Arrest :  డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!

Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి