![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hyderabad: హైదరాబాద్‌లో తల్లి, తండ్రి నీచపు పని.. ఆ పని చేయాలని కూతురిపై తీవ్ర ఒత్తిడి
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన కుమార్తను భిక్షాటన చేయించాడు. అంతేకాక వ్యభిచారం చేయాలంటూ కూతురిపై తల్లి ఒత్తిడి తెచ్చింది.
![Hyderabad: హైదరాబాద్‌లో తల్లి, తండ్రి నీచపు పని.. ఆ పని చేయాలని కూతురిపై తీవ్ర ఒత్తిడి Hyderabad Father, mother forces daughter to do prostitution and Begging Hyderabad: హైదరాబాద్‌లో తల్లి, తండ్రి నీచపు పని.. ఆ పని చేయాలని కూతురిపై తీవ్ర ఒత్తిడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/59cd6d6bcb143055dc608438b6424660_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్‌లో ఓ తండ్రి నీచానికి పాల్పడ్డాడు. కన్న కూతురు అని కూడా చూడకుండా ఆమెతో భిక్షాటన చేయించాడు. అంతేకాక, వ్యభిచారం చేయాలంటూ మరోవైపు ఆమె తల్లి కూడా ఒత్తిడి తెచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికకు చిన్న వయసులోనే సొంత వారి నుంచే ఈ బలవంతపు ఒత్తిళ్లు ఎదురుకావడంతో ఆమె కుమిలిపోయింది. ఇంట్లో పెద్ద వారికి ఎదురు మాట్లాడలేక కుంగిపోయింది. చివరికి ఓ వ్యక్తి చొరవతో ఆ బాలికకు విముక్తి కలిగింది. హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలివీ..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన కుమార్తను భిక్షాటన చేయించాడు. అంతేకాక వ్యభిచారం చేయాలంటూ కూతురిపై తల్లి ఒత్తిడి తెచ్చింది. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లో నివసించే 16 ఏళ్ల బాలికతో తల్లి దగ్గరుండి భిక్షాటన చేయిస్తుందని గత నెల 28న చైల్డ్ లైన్‌కు ఓ వ్యక్తి సమాచారం ఇచ్చారు. అమీర్ పేటలోని ఓ ఆలయం వద్ద తల్లీ కుమార్తెలు ఉన్నారని సదరు వ్యక్తి చెప్పడంతో చైల్డ్ లైన్ సభ్యురాలు మహేశ్వరి అక్కడికి వెళ్లి ఆరా తీశారు. ఆ సమయంలో అక్కడ బాలిక కనిపించలేదు.
బాలిక కనిపించకపోవడంతో మహేశ్వరి వెనక్కి వచ్చేశారు. బుధవారం ఖమ్మం చైల్డ్ లైన్ సమన్వయకర్త శ్రీనివాస్, హైదరాబాద్ చైల్డ్‌లైన్ కో-ఆర్డినేటర్ సాల్మన్ రాజుకు ఫోన్ చేసి.. ఈనెల 6న ఖమ్మం బస్టాండ్ వద్ద బాలిక ఉండగా సంరక్షణలోకి తీసుకోమని చెప్పారు. తల్లి బలవంతంగా భిక్షాటన చేయించడంతో పాటు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెస్తోందని బాలిక వివరించినట్లుగా వారు చెప్పారు. తాను అమీర్‌పేట ఆలయం వద్ద నుంచి పారిపోయి ఖమ్మం వచ్చానని బాధితురాలు చెప్పింది. సాల్మన్‌రాజ్ ఫిర్యాదు మేరకు బాలిక తల్లిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే, బాలిక పారిపోయినా తల్లి పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆమె అసలు సొంత తల్లేనా అనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో అసలు విషయం కూడా విచారణ జరుపుతున్నామని సాల్మన్ రాజ్ తెలిపారు.
Also Read: Nellore: నెల్లూరులో యువకుడు దారుణ హత్య... పక్కనే యువతి ఫొటోలు... ప్రేమ వ్యవహారమే కారణమా..?
Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)