(Source: ECI/ABP News/ABP Majha)
ED Searches : తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడు, ఎంబీఎస్ జ్యువెలర్స్ శాఖల్లో సోదాలు
ED Searches : హైదరాబాద్, విజయవాడలోని ఎంబీఎస్ జ్యువెలర్స్ కు చెందిన శాఖల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తుంది.
ED Searches : తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడు పెంచింది. పలు సంస్థలపై వరుసదాడులు చేస్తుంది. హైదరాబాద్, విజయవాడలో సోమవారం ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తుంది. MBS జ్యువెలర్స్ లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. 2021లోనే MBS జ్యువెలర్స్ కు సంబంధించిన రూ.365 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ సోదాలు చేస్తుంది. సోమవారం తెల్లవారు జామున 6 గంటల నుంచి ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడలో తనిఖీలు చేస్తుంది. ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్, ముసద్దిలాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోదాలు నిర్వహిస్తోంది.
మనీలాండరింగ్ కేసు
2016 నవంబర్ 8వ తేదీ తర్వాత ఎంబీఎస్ బ్యాంకు ఖాతాల్లో రూ 500, రూ.1000 డీమోనిటైజ్ నోట్లను రూ. 111 కోట్ల మేర జమ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మనీలాండరింగ్ నివారణ చట్టం కింద కేసులు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కైలాష్ చంద్ గుప్తా, అతని కుమారులు చార్టర్డ్ అకౌంటెంట్ సంజయ్ సర్దాతో కలిసి పెద్ద మొత్తంలో
మనీలాండరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముసద్దిలాల్ సంస్థ నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించారని ఈడీ గుర్తించింది.
ముందస్తు బెయిల్
బంగారం కొనుగోళ్లలో అక్రమాలపై ఈడీ నమోదు చేసిన కేసులో ఎంబీఎస్ జ్యువెలర్స్ డైరెక్టర్ సుఖేశ్ గుప్తాకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను ఇటీవల మంజూరు చేసింది. సుఖేశ్ గుప్తాపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో 2014లో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ సుఖేశ్ గుప్తా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ కె.సురేందర్ ధర్మాసనం షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను గ్రాంట్ చేసింది. ఈడీ పిలిచినప్పుడు తప్పనిసరిగా విచారణకు హాజరు రావాలని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. రూ.2 లక్షల పూచీకత్తు కోర్టుకు సమర్పించాలని తెలిపింది. సుఖేశ్ గుప్తాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోసం ఈడీ హైకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం తెలిపింది.
Also Read : Nama Nageswara Rao : టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ షాక్, నామా ఆస్తులు అటాచ్!