News
News
X

ప్రియుడు చైన్లు కొట్టేస్తే- ప్రియురాలు అమ్మి పెడుతుంది- ఆదర్శ జంట అందమైన స్టోరీ

Hyderabad Crime News: హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 45 గ్రాముల బంగారంతో పాటు 6,900 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

FOLLOW US: 

Hyderabad News: హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు ప్టుకున్నారు. వారి వద్ద నుంచి 45 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 6 వేల 900 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ లో నడుచుకుంటూ వెళ్తున్న కనకలక్ష్మి అనే మహిళ మెడలో ఉన్న చైన్ ను లాగేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే సీసీ టీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. 

తుషార్ హిరమాన్ అనే 32 ఏళ్ల నిందితుడు ఈ చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడు తుషార్ హిరమాన్, మీదగడ్డ పద్మాలతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. డబ్బు అవసరమైనప్పుడల్లా చైన్ స్నాచింగ్ లకు పాల్పడేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు చైన్ స్నాచింగ్ కు పాల్పడి చైన్ ను ఎత్తుకెళ్లగా.. పద్మాలత దాన్ని అమ్మే ప్రయత్నం చేసింది. పక్కా సమాచారంలతో రంగంలోకి దిగిన పోలీసులు తుషార్ హిరమాన్ తో పాటు, పద్మలతను అరెస్ట్ చేశారు. 

అప్పు ఇచ్చిన వాడి ఇంటికి కన్నం వేసిన దొంగలు..

తమ అవసరాలకు డబ్బు అప్పుగా ఇచ్చిన వ్యక్తి ఇంట్లోనే చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను సీసీఎస్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు మూడు లక్షల ఆరవై వేల రూపాయల విలువగల 65 గ్రాముల బంగారు అభరణాలతోపాటు అర కిలో వెండి, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

News Reels

ఈ అరెస్ట్ సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన ఉరుగొండ శ్రీకాంత్ (35), కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన దేవుల పల్లి రవీందర్ (40), కుడికాల్ల సురేష్ (36)లు స్నేహితులు. అయితే వీరిలో శ్రీకాంత్ సెల్‌ఫోన్ కంపెనీలో కలెక్షన్ బాయ్‌గా పని చేస్తుండగా, మిగితా ఇద్దరు నిందితులు స్థానికంగా ఉండే ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తున్నారు. అయితే శ్రీకాంత్, రవీందర్ బావమరదులు కాగా.. సురేష్ వీరికి స్నేహితుడు. అయితే ప్రతిరోజూ పని అయిపోయిన వెంటనే ముగ్గురూ కలిసి మద్యం సేవించడం, జల్సా చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానంద కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్న బాధితుడితో పరిచయం పెంచుకున్నారు. 

మద్యం సేవించేందుకు అప్పులు..

తాము పని చేసే డబ్బులు తాగేందుకే సరిపోకపోవడంతో అప్పులు చేయడం ప్రారంభించారు. దయానంద కాలనీకి చెందిన ఓ వ్యక్తి నుంచి తరచుగా అప్పులు తీసుకోవడం, అతనితో ఆయన ఇంట్లోనే కలిసి మద్యం సేవించడం అలవాటుగా మార్చుకున్నారు. ఇదే క్రమంలో బాధితుడు బీరువాలోంచి డబ్బులు తీసి ఇస్తుండగా వాళ్లు కూడా తలుపు బయట నుంచి చూశారు. బీరువాలో ఉన్న బంగారంతో పాటు వెండి వస్తువులపై వారి కన్ను పడింది. ఎలాగైనా సరే వాటిని కొట్టేయాలనుకున్నారు. ఇందుకోసం ఓ పథకం వేశారు. బాధితుడికి పూటుగా మద్యం తాగించి ఇంట్లో దింపే నెపంతో అతడి ఇంట్లోకి వచ్చి ఆ వస్తువులను కాజేయాలనుకున్నారు. ప్లాన్ ప్రకారమే దఫాల వారిగా ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులతో పాటు డబ్బును చోరీ చేశారు. ఒకేసారి మొత్తం తీసుకెళ్తే అనుమానం వస్తుందని ఇలా దొంగతనం చేశారు. 

అయితే విషయం గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు డీసీపీ పుష్ప ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. ఒక్కరోజులోనే నిందితులను గుర్తించారు. అయితే చోరీ చేసిన సొత్తును నిందితులు ఈ రోజు ఉదయం వరంగల్ బిలియన్ మార్కెట్ లో అమ్మేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన సీసీఎస్ మరియు మీల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కల్సి వెళ్లి నిందితులను ఆదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి  65 గ్రాముల బంగారు అభరణాలతో పాటు అర కిలో వెండి, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులను గట్టిగా ఇంటరాగేట్ చేయడంతో చోరీ చేసింది తామే అని ఒప్పుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

Published at : 28 Oct 2022 04:45 PM (IST) Tags: Hyderabad crime news Hyderabad News Telangana News Chain Snatchers Arrest Thieves Arrest

సంబంధిత కథనాలు

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Warangal: ఫారిన్ చాక్లెట్ పిల్లాడి ప్రాణం తీసింది, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి

Warangal: ఫారిన్ చాక్లెట్ పిల్లాడి ప్రాణం తీసింది, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

టాప్ స్టోరీస్

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!