X

Hyderabad: హైదరాబాద్ లో దారుణ ఘటన... ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య...మృతదేహాన్ని పరుపులో చుట్టి నిందితుడు పరారీ

హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై ఓ మృగాడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని హత్య చేసి పరుపులో చుట్టి ఇంటిలో పెట్టి తాళం వేశాడు.

FOLLOW US: 

హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారిపై ఉన్మాది దారుణానికి ఒడిగట్టాడు. బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు. ఐదేళ్ల చిన్నారి గురువారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు కాలనీ మొత్తం వెతికారు. చివరికి పక్కింట్లో చిన్నారి మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గురవారం అర్ధరాత్రి పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై స్థానికులు రాళ్లురువ్వారు. ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. 

ఆడుకునేందుకు వెళ్లి

నల్గొండ జిల్లా చందంపేట మండలానికి చెందిన ఓ కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. వారి పెద్దమ్మాయి(5) రోజులాగానే ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. స్థానిక మసీద్, చర్చిలో మైకుల ద్వారా ప్రచారం చేయించారు. అయినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సింగరేణి కాలనీలో గాలించారు. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించినా ఫలితం లేకపోయింది.

పరుపులో విగతజీవిగా...

బాధితులు ఇంటి పక్కనే ఉంటున్న రాజు అనే యువకుడు చెడు వ్యసనాలకు అలవాటై చిల్లర దొంగతనాలు పాల్పడేవాడు. రోజు మద్యం సేవించి భార్య, పిల్లల్ని వేధించేవాడు. దీంతో కొద్ది రోజుల క్రితం అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత తల్లి కూడా వెళ్లిపోయింది. కొద్దిరోజులుగా ఒంటరిగా ఉంటున్న రాజు కూలీ పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతూ జల్సాలు చేస్తూ తిరుగుతుండేవాడు. పక్కింట్లో ఉంటున్న రాజు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని పరుపులో మూట కట్టి ఇంటికి తాళం వేసి అక్కడినుంచి పారిపోయాడు. ఇదంతా తెలుసుకున్న స్థానికులు పాప కోసం వెతికారు. చిన్నారి నాయనమ్మకి పక్కింట్లో ఉండే రాజుపై అనుమానం వచ్చింది. స్థానికులు ఇంటి తాళం పగలగొట్టాలని ప్రయత్నించారు. అనుమానం బలపడటంతో 10 గంటల ప్రాంతంలో తాళం పగలగొట్టి చూడగా పరుపులో చిన్నారి శవమై కనిపించింది.

నిందితుడిని అప్పగించాలని ఆందోళన

దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. నిందితుడిని పట్టుకొని తమకు అప్పగించేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదని పట్టుబట్టారు. దిశ ఎన్‌కౌంటర్ మాదిరిగానే ఈ నిందితుని కూడా ఎన్ కౌంటర్ చేయాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు పట్టుబట్టారు. చివరకు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉన్నతాధికారులు 300 మంది పోలీసులను రంగంలోకి దించారు.  చివరికి పోలీసులు బలవంతంగా మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ తోపులాటలో కొంత మంది పోలీసులు, స్థానికులకు గాయాలయ్యాయి. 

Also Read: D2 strain: ఉత్తర్ ప్రదేశ్ లో డెంగీ విజృంభణ... డెంగీ మరణాలకు డీ2 స్ట్రైయిన్ కారణం... ప్రాణాంతక రక్తస్రావం కలిగిస్తుందంటున్న ఐసీఎంఆర్ వైద్యులు

Tags: Hyderabad crime news Hyderabad TS News Crime News girl rape cydabad

సంబంధిత కథనాలు

Crime News: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..

Crime News: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..

Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్

Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్

Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?

Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?

East Godavari Crime: బైక్ సీటు కింద గంజాయి సీక్రెట్ గా రవాణా... కేటుగాళ్ల ఎత్తును చిత్తుచేసిన పోలీసులు

East Godavari Crime:  బైక్ సీటు కింద గంజాయి సీక్రెట్ గా రవాణా... కేటుగాళ్ల ఎత్తును చిత్తుచేసిన పోలీసులు

Mulugu Encounter: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్... 27న బంద్ కు పిలుపునిచ్చిన మావోలు...

Mulugu Encounter: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్... 27న బంద్ కు పిలుపునిచ్చిన మావోలు...
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Minister Srinivas Goud: ఏడేళ్ల పసికూన దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి... ప్లీనరీ సక్సెస్ తో ప్రత్యర్థుల్లో గుబులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

Minister Srinivas Goud: ఏడేళ్ల పసికూన దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి... ప్లీనరీ సక్సెస్ తో ప్రత్యర్థుల్లో గుబులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

T20 WC Update: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ దూరం.. వేటు తప్పదా.. అసలు వివాదం ఏంటంటే..?

T20 WC Update: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ దూరం.. వేటు తప్పదా.. అసలు వివాదం ఏంటంటే..?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Ritu Varma: ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Ritu Varma:  ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!