అన్వేషించండి

Wife Murder: లవర్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుందని కాల్చి చంపిన భర్త - ఫేస్‌బుక్ లైవ్ కూడా పెట్టాడు !

Gwalior murder: గ్వాలియర్ లో బార్యను కిరాతకంగా కాల్చి చంపిన ఘటనలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ప్రియుడి బర్త్ డేను భార్య సెలబ్రేట్ చేసుకుందని భర్త కాల్చి చంపాడు.

Gwalior Wife murder:  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రూప్ సింగ్ క్రికెట్ స్టేడియం సమీపంలో జరిగిన దారుణ హత్య కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాచయి.  33 ఏళ్ల అరవింద్ పరిహార్ అనే వ్యక్తి, తన 28 ఏళ్ల భార్య నందిని కేవట్‌ను బహిరంగంగా  నాలుగు రౌండ్ల పాటు  కాల్చి చంపాడు. ఈ ఘటన తర్వాత, అరవింద్ ఆమె శవం పక్కనే కూర్చుని, .315 బోర్ పిస్టల్‌ను చూపిస్తూ ఫేస్‌బుక్ లైవ్‌లోకి వెళ్లాడు. ఈ లైవ్‌లో ఆయన తన భార్య తనపై తప్పుడు కేసులు పెట్టిందని, ఆమె ప్రియుడు అంకుష్ పాఠక్ ఆదేశాలతో ఇలా చేసిందని ఆరోపించాడు.
 
అరవింద్ , నందిని 2023లో ఆర్య సమాజ్  లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహం తర్వాత కొద్ది రోజుల్లోనే వారి సంబంధం దెబ్బతినడం ప్రారంభమైంది. నందిని తన భర్తకు అప్పటికే వివాహం అయి సంతానం ఉందని తెలుసుకుంది. అలాగే  మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకుని, అతడిపై పోలీసు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు తర్వాత అరవింద్ ఆమెను కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడని, దీనిపై కూడా కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అరవింద్ గతంలో అరెస్టు అయినప్పటికీ, బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆమెను మరింత వేధించాడు.                 
 
ఈ హత్యకు ప్రధాన  కారణంగా   నందిని సెప్టెంబర్ 8న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోగా భావిస్తున్నారు.  ఈ వీడియోలో ఆమె తన స్నేహితుడు అంకుష్ పాఠక్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న దృశ్యాలున్నాయి.  ఈ వీడియో చూసిన అరవింద్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నందినికి అంకుష్‌తో  వివాహేతర  సంబంధం ఉందని ఆరోపిస్తూ, ఆమె తన డబ్బు, కార్లను తీసుకుని ఇతరులతో సంబంధాలు కొనసాగిస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేశాడు.               

సెప్టెంబర్ 12న, నందిని అంకుష్ పాఠక్, మరో స్నేహితుడు కల్లూతో కలిసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  కార్యాలయానికి వెళ్లి అరవింద్‌పై మరో ఫిర్యాదు చేసింది. ఆమె ఎస్‌పీ కార్యాలయం నుంచి ఆటో-రిక్షాలో తిరిగి వస్తుండగా, అరవింద్ వారిని రూప్ సింగ్ స్టేడియం సమీపంలో అడ్డగించి, .315 బోర్ పిస్టల్‌తో ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నాలుగు బుల్లెట్లు నందినిని తాకాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.            
 
హత్య తర్వాత, అరవింద్ నందిని శవం పక్కన కూర్చుని, తన పిస్టల్‌తో సమీపంలోని వారిని బెదిరించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, ఆయన వారిపై కూడా పిస్టల్ ఎక్కుపెట్టాడు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించి, గరిష్ట జాగ్రత్తలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరవింద్‌ను అరెస్టు చేసిన పోలీసులు, ఆయన వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని, హత్య కేసు నమోదు చేశారు.                

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget