Crime News: ఏపీలో దారుణాలు - యువతిపై హోంగార్డు అత్యాచారం, హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని డెలివరీ, ఎక్కడంటే?
Vijayanagaram News: ఏపీలో దారుణాలు వెలుగుచూశాయి. విజయనగరం జిల్లాలో ఓ యువతిపై హోంగార్డు అత్యాచారానికి పాల్పడగా.. ప్రకాశం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని బాత్రూంలోనే ప్రసవించింది.
Home Guard Abused Young Woman In Vijayanagaram: విజయనగరం జిల్లాలో (Vijayanagaram District) దారుణం జరిగింది. ఓ ప్రేమ జంటను బెదిరించిన హోంగార్డు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై చర్యలు చేపట్టారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల (Nellimarla) మండలంలో యువతిపై హోంగార్డు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బొండపల్లి (Bondapally) పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించే హోంగార్డు మొయిద సురేశ్ మంగళవారం సాయంత్రం ఇంటికి బయలుదేరగా.. కొండకరకం సమీపంలో ఓ ప్రేమజంట కనిపించగా.. వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను ఎస్సైనంటూ ఇక్కడ ఏం చేస్తున్నారని నిలదీశాడు. దీంతో ప్రియుడు అక్కడి నుంచి భయంతో వెళ్లిపోయాడు.
బస్సెక్కిస్తానని నమ్మించి..
అనంతరం యువతిని ఆమె సొంతూరు వెళ్లేందుకు బస్సెక్కిస్తానని నమ్మించి తన బైక్‌పై రామతీర్థం సమీపంలోని చంపావతి ఒడ్డున ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తిరిగి ఆమెను రామతీర్థం కూడలి వద్ద విడిచిపెట్టి వెళ్తూ.. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నెల్లిమర్ల పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. సురేశ్‌ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని డెలివరీ
అటు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మోటుమాలలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం బాత్‌రూంలో ఓ విద్యార్థిని ప్రసవించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని బాత్‌రూంలో డెలివరీ కాగా.. తోటి విద్యార్థినులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. అయితే, పుట్టిన బిడ్డ మృతి చెందినట్లుగా అధికారులు నిర్ధారించారు. కాగా, 2 నెలల క్రితమే సదరు విద్యార్థిని విద్యాలయంలో చేరినట్లు తెలుస్తోంది. విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురి కాగా.. ఒంగోలు రిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read: Viral News: దొరికిన గుడ్లను కోడితో పొదిగించిన యజమాని- పిల్లలు పెద్దవయ్యేసరికి షాక్