Viral News: దొరికిన గుడ్లను కోడితో పొదిగించిన యజమాని- పిల్లలు పెద్దవయ్యేసరికి షాక్
Andhra Pradesh: ఒక వ్యక్తి తనకు అడవిలో గుడ్లు దొరకడంతో, ఇంట్లో ఉన్న తన కోడితో పొదిగించాడు. కొన్ని వారాల తర్వాత ఎదిగే పిల్లలను చూస్తే అవి నెమలిగా గుర్తించాడు.
Alluri Seetharamaraju District: పక్షి జాతుల్లో కోడికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. కోడి పొదిగినప్పుడు తనకింద ఏ గుడ్లు ఉంచినా వాటిని పొదిగి పిల్లలు పెడుతుంది. తన కింద పెరిగిన పిల్లలను తన పిల్లలతోపాటే అపురూపంగా చూసుకుంటుంది. ఇలాంటి అపూరుప ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. ఒక కోడి నెమలి గుడ్లను ఆ పిల్లలను కూడా తనతోపాటే తిప్పుకోవడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం 5 పిల్లలను పొదిగి తన కోడి పిల్లలతోపాటే తన వెంట తిప్పుకోవడం చూసినవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాతులు వేరైనా తల్లి బంధం ఆ రెండింటినీ దగ్గర చేసి ప్రేమను పంచుతోంది.
అడవిలో దొరికిన గుడ్లను తెచ్చి...
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక వ్యక్తి పని మీద అడవికి వెళ్లాడు. అక్కడ తనకు కొన్ని గుడ్లు కనిపించాయి. ఆ గుడ్లు ఏ పక్షివి అనేది అర్థం కాలేదు. అదే సమయంలో తన ఇంట్లో ఒక పొదిగిన కోడి పెట్ట ఉంది. వెంటనే ఆ వ్యక్తి ఆ గుడ్లను తెచ్చి ఆ కోడి కిందనే కోడి గుడ్లతోపాటే పొదిగించేందుకు ఉంచాడు. దాదాపు మూడు వారాల తర్వాత ఆ గుడ్లు పొదిగి పిల్లలు వచ్చాయి. మొత్తం 5 గుడ్లు పొదిగి నెమలి పిల్లలు వచ్చాయి. కానీ వాటిని కూడా కోడి పిల్లలే అనుకున్నాడు.
Also Read: టీమ్ మీటింగ్‌లో డ్యాన్స్ చేసిన ఉద్యోగి, ఫిదా అయిపోయిన కొలీగ్స్
ఇంతకీ తాను తెచ్చింది ఏ పక్షి గుడ్లు అనేది, పిల్లలను పొదిగినప్పటికీ ఆ వ్యక్తికి అర్థం కాలేదు. పిల్లలు క్రమంగా పెరుగుతన్న కొద్దీ కొన్నింట్లో మార్పులు గమనించాడు. వాటికి తలపై పింఛం రావడం, తోక పెరగడం మొదలైంది. అప్పుడు కానీ అవి నెమలి పిల్లలని, తాను నెమలి గుడ్లు తెచ్చి పొదిగించానని ఆ వ్యక్తికి అర్థం కాలేదు. కోడి నెమలి పిల్లలను పొదిగిందన్న వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించింది. ఈ వింతను చూసేందుకు జనం తరలివస్తున్నారు. కోడితో పాటే ముద్దుముద్దుగా తిరుగుతున్న నెమలి పిల్లలను చూసిన జనాలు ఆనందంతోపాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నెమలి క్రయవిక్రయాలు నేరం..
జాతి వైరాన్ని కూడా పక్కనపెట్టి కోడి కూడా నెమలి పిల్లలను అపురూపంగా తనవెంట తిప్పుకోవడం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ వింతను చూడటానికి వచ్చిన వారంతా వీడియోలు తీసుకుని సంబర పడిపోతున్నారు. ఒకొరికొకరు వాట్సాపు గ్రూపుల్లో పంపుకోవడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. జాతీయ పక్షి నెమల తమ ఇంట పుట్టిందని తెలిసిన దాని యజమాని ఆనందానికి కూడా హద్దులు లేవు. జాతీయ పక్షిగా పరిగణింపబడిన నెమలిని వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం పరిరక్షించేందుకు భారత ప్రభత్వం కొన్ని చట్టాలు చేసింది. షెడ్యూల్ 1 ప్రకారం నెమలిని చంపడం, క్రయవిక్రయాలు చేయడం, వేటాడటం, బంధించడం చట్టరీత్యా నేరం.
Also Read: గుంపులో తప్పిపోయిన కుక్క, 250 కిలోమీటర్లు ప్రయాణించి మళ్లీ ఓనర్ ఇంటికి - అద్భుతం