Viral News: గుంపులో తప్పిపోయిన కుక్క, 250 కిలోమీటర్లు ప్రయాణించి మళ్లీ ఓనర్ ఇంటికి - అద్భుతం
Karnataka News: మహారాష్ట్రలో తప్పిపోయిన ఓ కుక్క దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించి కర్ణాటకలో తన ఓనర్ ఇంటికి చేరుకుంది. ఎవరి సాయం లేకుండా ఎలా వచ్చిందో అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Viral News in Telugu: కర్ణాటకలోని బెలగవి జిల్లాలోని యమగర్ని గ్రామంలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. ఒక్కసారిగా ఓ వీధి వీధంతా సందడి వాతావరణం కనిపించింది. పూలు, కుంకుమతో అంతా పండగ చేసుకున్నారు. అంత హడావిడి ఓ కుక్క కోసం. ఆ కుక్కకు దండ వేసి బొట్టు పెట్టి డ్యాన్స్‌లు వేశారు స్థానికులు. ఇదంతా ఎందుకో తెలియాలంటే ముందు ఈ కథ తెలుసుకోవాలి. ఇటీవల మహారాష్ట్రలోని పందర్‌పూర్‌లో ఈ కుక్క అదృశ్యమైంది. అప్పటి నుంచి యజమాని తెగ కంగారు పడిపోతున్నాడు. అన్ని చోట్లా వెతికించాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఇక అది తప్పిపోయినట్టే అని అనుకున్నాడు. కానీ ఆ కుక్క మాత్రం 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన యజమాని ఇంటికి వచ్చేసింది. ఎవరి సాయం లేకుండానే సొంతగా దారి గుర్తు పెట్టుకుని వెనక్కి తిరిగి వచ్చింది. ఆ కుక్కను చూసిన వెంటనే ఓనర్ ఎగిరి గంతులేశాడు. అసలు ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోయాడు. ఇది చూసి స్థానికులూ సర్‌ప్రైజ్ అయ్యారు. (Also Read: Viral News: మూడో తరగతి విద్యార్థిని గన్‌తో కాల్చిన ఐదేళ్ల చిన్నారి, స్కూల్‌లోనే షాకింగ్ ఘటన)
జూన్ చివరి వారంలో కమలేశ్ కుంభర్ పంధర్‌పూర్‌లో పాదయాత్రకు వెళ్లాడు. ఏటా ఈ కార్యక్రమానికి వెళ్తాడు. అయితే..ఈ సారి ఆయనతో పాటు కుక్క "మహారాజ్" కూడా వెళ్లింది. దాదాపు 250 కిలోమీటర్ల పాటు ఓనర్‌తో పాటు కలిసి నడిచింది. కొంత దూరం వెళ్లాక ఉన్నట్టుండి అది కనిపించకుండా పోయింది. చాలా చోట్ల వెతికి ఓనర్ అలిసిపోయాడు. ఇంకెవరితోనే ఆ కుక్క వెళ్తుండగా చూసినట్టు కొంతమంది చెప్పారు. అక్కడితో ఆశ వదిలేసుకుని తిరిగి వచ్చాడు కమలేశ్. ఆ మరుసటి రోజే ఇంటి ముందు వచ్చి నిలబడింది. ఓనర్‌ని చూడగానే తోక ఊపుతూ పలకరించింది. ఆశ్చర్యం, అద్భుతం అంటూ చుట్టూ ఉన్న వాళ్లంతా సందడి చేశారు. ఆ దేవుడే కుక్కకి దారి చూపించి ఇంటికి పంపించాడని అంటున్నారు.
Also Read: Viral Video: టీమ్ మీటింగ్‌లో డ్యాన్స్ చేసిన ఉద్యోగి, ఫిదా అయిపోయిన కొలీగ్స్