YS Viveka Case : దస్తగిరి అప్రూవర్‌గా ఓకే - వివేకా కేసు నిందితులకు ప్రాణహాని !
దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వివేకా హత్య కేసు నిందితులకు భద్రత కల్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ వివేకానందరెడ్డి ( YS Vivekananda Reddy ) హత్య కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రతీ రోజూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మారుతున్నట్టు వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరి ( Dastagiri ) ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు.
పోలీసుల విచారణ ఖాకీ సినిమా రేంజ్‌లో సాగింది, హంతకుడు మాత్రం కూల్‌గా కాలు కదపకుండా కూర్చున్నాడు
వివేకా హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారతాడని, అతని సాక్ష్యాన్ని నమోదు చేసి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ కడప చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ...సీఆర్‌పీసీ సెక్షన్ 306 ( CRPC Section 306 ) కింద అక్టోబరు 22న పిటిషన్ దాఖలు చేసింది. నవంబరు 26న ఈ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. అయితే కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు విరుద్ధమని ఈ ఉత్తర్వుల నేపథ్యంలో పులివెందుల జ్యుడీషియల్ మొదటి తరగతి న్యాయస్థానం సీఆర్‌పీసీ సెక్షన్ 306(4)(ఏ)ప్రకారం దస్తగిరి సాక్ష్యం నమోదు చేస్తారని వీరు పిటిషన్‌లో పేర్కొన్నారు. నేరాన్ని నిరూపించేందుకు ఇతర సాక్ష్యాలు లేనప్పుడు మాత్రమే సీఆర్‌పీసీ సెక్షన్ 306కింద సీబీఐ పిటిషన్ దాఖలు చేయాలి. కేసులో ఇతర సాక్ష్యాలు ఉన్నాయని అందుకే అప్రూవర్ గా మారడాన్ని అంగీకరించవద్దన్నారు. అయితే వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లను తోసి పుచ్చింది. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని అంగీకరించింది.
మావోయిస్టులను కదిలించిన సోనాలి పోరాటం, ఎట్టకేలకు ఇంజనీర్ అశోక్ పవార్, ఆనంద్ విడుదల
మరో వైపు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులకు ముప్పు ఉందని భద్రత పెంచాలని టీడీపీ నేత వర్ల రామయ్య ( Varla Ramaiah ) జైళ్ల శాఖ డైరక్టర్‌కు లేఖ రాశారు. కడప కేంద్ర కారాగారం నుంచి వరుణారెడ్డిని బదిలీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖ ఢిల్లీ చేరకుండానే వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చూస్తుంటే వివేక హత్య కేసు నిందితులకు ప్రాణ హాని ఉందని తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తున్న కొంతమంది పెద్దలకు సైతం వివేక హత్యతో సంబంధం ఉందనే అనుమానం ఉందని లేఖలో ఆరోపించారు. ఈ కేసు విషయం రాజకీయం కావడంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ ఏర్పడింది.