(Source: ECI/ABP News/ABP Majha)
Maoists Released Engineer: మావోయిస్టులను కదిలించిన సోనాలి పోరాటం, ఎట్టకేలకు ఇంజనీర్ అశోక్ పవార్, ఆనంద్ విడుదల
Maoists Released Engineer: ఇంజనీర్ అశోక్ పవార్ భార్య సోనాలి పవార్ తన భర్త కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇంజినీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు విడుదల చేశారు.
Maoists Released Engineer In Chattisgarh: మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న ఇద్దరు విడుదల అయ్యారు. అందులో ఒకరు ఇంజినీర్ అశోక్ పవార్ కాగా, మరో వ్యక్తి ఆనంద్ యాదవ్ అనే కార్మికుడు. దాదాపు 5 రోజుల కిందట బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నదిపై వంతెన నిర్మాణం జరుగుతుండగా, అందులో పని చేస్తున్నందున కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు ఎట్టకేలకు విడిచిపెట్టారు.
ఇంజనీర్ అశోక్ పవార్ భార్య సోనాలి పవార్ తన భర్త కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇంద్రావతి నది దగ్గర వంతెన పర్యవేక్షణ పనులు చూస్తున్న ఇంజినీర్ పవార్‌ను కొందరు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి కిడ్నాప్ చేశారు. అశోక్ పవార్‌తో పాటు కార్మికుడు ఆనంద్ యాదవ్‌ను సైతం మావోయిస్టులు బెదిరించి తమతో తీసుకెళ్లారు. రెండు రోజులైనా భర్త జాడ తెలియకపోవడంతో ఇంజినీర్ భార్య ఆందోళనకు గురైంది. తన భర్తను వెతుక్కూంటూ అడవి బాట పట్టింది. భర్త అశోక్ పవార్‌కు ఏ హాని తలపెట్టవద్దని మావోయిస్టులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
తన భర్త ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించి వదిలేయాలని, అంతే కానీ ప్రాణహాని తలపెట్టకూడదని మావోయిస్టులకు ఆమె చేసిన ప్రార్థన ఫలించింది. ఆమె కుటుంబసభ్యుల విజ్ఞప్తి, మానవ హక్కుల సంఘాల వినతి మేరకు ఇంజినీర్ అశోక్ పవార్‌ను మావోయిస్టులు తమ చెర నుంచి విడుదల చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు అశోక్ పవార్ శివనారాయణలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ప్రాజెక్టు పనిలో ఉండగా ఇటీవల మావోయిస్టులు ఇంజినీర్‌తో పాటు కార్మికుడ్ని బంధీలుగా చేసుకున్నారు. తాజాగా వారికి మావోయిస్టుల చెర నుంచి విముక్తి లభించింది.
గత ఏడాది ఇలాంటి ఘటనే..
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సివిల్ ఇంజనీర్ అజయ్ లక్రా, సిబ్బంది లక్ష్మణ్‌ను మావోయిస్టులు గత ఏడాది కిడ్నాప్ చేశారు. ఇంజనీర్‌ను విడిపించేందుకు ఆయన భార్య అర్పిత అడవి బాట పట్టారు. స్థానిక జర్నలిస్ట్ సాయంతో రెండేళ్ల కూతురితో పాటు అడవిలోకి వెళ్లి మావోయిస్టులను వేడుకుని తన భర్తను విడిపించుకున్నారు. ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు అర్పితకు న్యాయం చేయాలని భావించి ఆమె భర్త, ఇంజనీర్ అజయ్ అక్రాను క్షేమంగా విడుదల చేశారు. మావోయిస్టు చెర నుంచి విడుదలయ్యాక కుటుంబాన్ని కలుసుకున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యాయి. అర్పిత సాహసం, పోరాటాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. నేడు సోనాలి అదే పని చేసి తన భర్తను మావోయిస్టుల చెర నుంచి విడిపించుకున్నారు.
Also Read: Khammam Crime: మామ గారితో కోడలు అఫైర్! పడకపై ఉండగా చూసిన కన్న కూతురు, చివరికి ఏమైందంటే