News
News
X

Khammam Crime: మామ గారితో కోడలు అఫైర్! పడకపై ఉండగా చూసిన కన్న కూతురు, చివరికి ఏమైందంటే

మామా కోడళ్లు ఒక్కటిగా ఉన్న వేళ కన్న కూతురు చూడటంతో విషయం బయటకు పొక్కుతుందని భయపడి కూతురినే చంపేశారు.

FOLLOW US: 

ఆమె వయస్సు 30.. మామ వయస్సు 55.. బందాలు, వయస్సు మరిచిన ఆ ఇద్దరు అక్రమ సంబందం పెట్టుకున్నారు. సభ్య సమాజం చీదరించుకొంటుందని తెలిసినా కామం తలకెక్కిన ఆ ఇద్దరు తరుచూ ఒక్కటవుతున్నారు. ఓ వైపు ఇంట్లో అత్త, కన్న కూతురు ఉన్నా వారి కళ్లు కప్పి అక్రమ సంబందం కొనసాగిస్తున్నారు.. అయితే మామా కోడళ్లు ఒక్కటిగా ఉన్న వేళ కన్న కూతురు చూడటంతో విషయం బయటకు పొక్కుతుందని భయపడి కూతురినే కడతేర్చారు. చివరకు చేసిన హత్యను కప్పిపుచ్చుకునేందుకు స్కూల్‌లో ఫిట్స్‌ (మూర్ఛ) వచ్చిందని చెప్పి మాయమాటలు చెప్పినప్పటికీ కన్న తండ్రికి తన కూతురి మరణంపై అనుమానం రావడంతో చివరికి చేసిన పాపం కాస్తా పోలీసు విచారణలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా బోనకల్‌ గ్రామానికి పాలెపు హరికృష్ణ, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హరికృష్ణ లారీ నడుపుతూ కుటుంబాన్ని సాకేవాడు. తరుచూ పనిలో బాగంగా బయటకు వెళ్లేవాడు. సునీత తన భర్త తండ్రి నర్సింహ రావుతో శారీరక సంబందం ఏర్పడింది. సుమారు ఐదారేళ్లుగా వీరి అక్రమ సంబందం కొనసాగుతుంది. ఇంట్లో నర్సింహారావు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా వారి కళ్లుకప్పి వీరి అక్రమ సంబందాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల తల్లి, తాత ఒకే గదిలో ఉండగా పెద్దకూతురు మహాదేవి గమనించింది. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని చెప్పడంతో సునీత నర్సింహారావులు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. 

స్కూల్‌లో ఫిట్స్‌ వచ్చి చనిపోయినట్లు చిత్రీకరణ..
మహాదేవిని చంపాలని నిర్ణయించుకున్న సునీత, నర్సింహారావులు కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వైరుతో మెడపై చుట్టి చంపేశారు. ఆ తర్వాత తన కూతురు ఫిట్స్‌తో స్కూల్‌లో చనిపోయిందని అందరిని నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే పాప మెడపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన బందువులు పోలీసులకు సమాచారం అందించారు. 

ఓవర్‌ యాక్షన్‌తో దొరికిన తాత..
విషయం తెలుసుకున్న పోలీసులు మహాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం నిర్వహిస్తే తమ నిర్వాకం అందరికి తెలిసిపోతుందని భావించిన తాత నర్సింహారావు తన మనవరాలికి పోస్టుమార్టం నిర్వహించ వద్దని అడ్డుకోసాగాడు. అనుమానం వచ్చిన పోలీసులు నర్సింహారావును అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో అసలు విషయం ఒప్పుకున్నారు. పోలీసులు సునీత, నర్సింహారావులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన పూర్తిచేసిన మదిర సీఐ మురళి, ఎస్సై కవితలను వైరా ఏసీపీ స్నేహా మెహ్ర అభినందించారు.

Published at : 16 Feb 2022 08:47 AM (IST) Tags: Khammam Illegal affair Extra Marital Affairs Khammam Crime bonakal girl murder uncle niece affairs

సంబంధిత కథనాలు

Pauri Garhwal Bus Accident: పండగ పూట విషాదం- లోయలో పడిన బస్సు, 25 మంది మృతి!

Pauri Garhwal Bus Accident: పండగ పూట విషాదం- లోయలో పడిన బస్సు, 25 మంది మృతి!

Fake Currency: యూట్యూబ్‌లో చూసి ఫేక్ కరెన్సీ తయారీ, డౌట్ రాకుండా మార్కెట్‌లోకి - ఇంతలోనే ఝలక్!

Fake Currency: యూట్యూబ్‌లో చూసి ఫేక్ కరెన్సీ తయారీ, డౌట్ రాకుండా మార్కెట్‌లోకి - ఇంతలోనే ఝలక్!

హ్యండిల్ లాక్ వేయడం మరిచారంటే మీ వాహనం మాయమైపోయినట్లే!

హ్యండిల్ లాక్ వేయడం మరిచారంటే మీ వాహనం మాయమైపోయినట్లే!

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Gujarat Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, 11 మంది మృతి!

Gujarat Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, 11 మంది మృతి!

టాప్ స్టోరీస్

National Party: పేరు మారిస్తే జాతీయ పార్టీ అయిపోతుందా ? అసలు రూల్స్ ఇవిగో !

National Party:  పేరు మారిస్తే  జాతీయ పార్టీ అయిపోతుందా ? అసలు రూల్స్ ఇవిగో !

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన ఏంటీ?

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన ఏంటీ?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?