అన్వేషించండి

Kadiri Murder Case: పోలీసుల విచారణ ఖాకీ సినిమా రేంజ్‌లో సాగింది, హంతకుడు మాత్రం కూల్‌గా కాలు కదపకుండా కూర్చున్నాడు

'ఖాకీ' మూవీ రేంజ్‌లో పోలీసుల విచారణ సాగింది. 5 రాష్ట్రాలు, 90 రోజులు, లక్షల కాల్స్‌ పరిశీలించారు. వేల మంది నిందితులను కూడా విచారించారు. చివరకు నిందితుడుని ఆచూకీ తెలిశాక బిత్తరపోయారు.

పోలీసులకు సినిమా చూపించాడు. అలాంటి ఇలాంటి సినిమా కాదు. ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో వేలమందిని విచారించేలా చేశాడు. లక్షల కొద్దీ కాల్స్‌ను వినేలా చేశాడు. వేల సీసీ టివి ఫుటేజీని చూసేలా చేశాడు. 

మూడు నెలల క్రితం అనంతపురం జిల్లా కదిరిలోని ఎన్జీవో కాలనీలో ఒక మహిళా టీచర్‌ హత్య సంచలనంగా మారింది. ఈ దోపిడి వెనుక పార్థీ గ్యాంగ్, మధ్యప్రదేశ్ గ్యాంగ్‌లు ఉన్నాయన్న అనుమానం కలిగింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఒకటే విమర్శలు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న అనంతపురం జిల్లా పోలీసులు సీరియస్‌గా వేట మొదలు పెట్టారు.  

తొంబై రోజులుపాటు ఒక అదనపు ఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు డీఎస్సీల పర్యవేక్షణలో ముప్పై మంది అధికారులు... ఖాకీ సినిమాలో హీరో లెక్క తిరిగారు. తొంబై మంది ఈ కేసు విచారణలో శ్రమించారు. ఐదు రాష్ట్రాల్లో తిరుగతూ లక్షల ఫోన్ కాల్స్ విశ్లేషిస్తూ ఐదువేల మంది అనుమానితులను విచారించారు. 

మూడు నెలలు తిండి తిప్పలు మానేసి విచారించిన పోలీసులు.. నిందితుడు ఎవరో తెలిసి షాక్‌ అయ్యారు. సిటీలోనే నిందితుడిని పెట్టుకొని ఊరంతా తిరిగామా అంటూ ఆశ్చర్యపోయారు. ఎక్కడైతే హత్య జరిగిందో అదే పట్టణానికి చెందిన పాత నేరస్థుడే ఈ హత్య చేశాడని తెలిసి బిత్తరపోయారు. 
మూడు నెలల సుదీర్ఘ విచారణ తర్వాత అసలు నేరస్తుడిని అరెస్టు చేసి 58 తులాల బంగారం, 97వేల డబ్బు స్వాధీనం చేసుకొన్నారు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.

అన్ని రాష్ట్రాలు తిరుగుతూ విచారణ చేసిన పోలీసులకు పాత నేరస్థులను దాదాపు 500 మందిపై నిఘా వేశారు. సంఘటనా స్థలంలోని ఫింగర్‌ ప్రింట్స్, సీసీ టీవీ ఫుటేజీని పోల్చిన అధికారులకు కళ్లు తేలేసే వివరాలు తెలిశాయి. నిందితుడు కదిరికి చెందిన షేక్ షపీవుల్లా(35)గా గుర్తిచారు. 
షేక్‌ షపీవుల్లా మొదట్లో పెట్రోల్ దొంగిలించేవాడు. తర్వాత ఇళ్లలో దొంగతనాలు చేయడంలో దిట్టగా మారాడు. నిందితుడిపై ఇప్పటివరకు పలు కేసులున్నాయ. కర్ణాటకలో కూడా నిందితుడిపై ఏడు కేసులున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. ఉపాధ్యాయురాలు ఉషారాణిని చంపి దొంగతనం చేయడమే కాకుండా సమీపంలోని టీ స్టాల్ రమణ భార్య శివమ్మపై కూడా దాడి చేశాడు నిందితుడు. 

ఈకేసులో నిందితుడి అరెస్ట్ విషయంలో కీలకంగా వ్యవహరించిని అధికారులను ప్రశంసించాడు జిల్లా ఎస్పీ పక్కీరప్ప. ఈ కేసులో ఇతర రాష్ట్రాలకు చెందిన పార్థీ గ్యాంగ్ కానీ, మరే ఇతర గ్యాంగుల పని కాదని తేల్చారు. సొంత జిల్లాలో ఉన్న దొంగను గుర్తించే విషయంలో కొంత ఆలస్యం జరిగిన్పటికి నిందితుడు మాత్రం పోలీసులకు దండుపాళ్యం సినిమా చూపించాడు.

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Embed widget