అన్వేషించండి

Koheda Tragedy: బిడ్డను అమ్మేసి వెరే వ్యక్తితో వెళ్లిపోయింది - ఆ భర్త ప్రాణం తీసుకున్నాడు - హైదరాబాద్ లో విషాదం

Child Selling Case: హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ పరిధిలో కన్న బిడ్డనే కసాయిగా అమ్మేసిన భార్య తీరుతో మనస్తాపం చెంది భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ముందే ఆ భార్య మరొకర్ని పెళ్లి చేసుకుంది.

Wife Betrayal:   హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో ఒక గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయే తన సర్వస్వం అని నమ్మి, ఆమెతో జీవితాన్ని పంచుకున్న గోవర్ధన్ అనే యువకుడు.. భార్య చేసిన దారుణమైన వంచనను భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యే తన బిడ్డను ఇంకొకరికి అమ్మేసిందనే నిజం తెలిసిన తర్వాత, ఆయన అనుభవించిన నరకయాతన వర్ణనాతీతం.                      

ప్రేమ వివాహం.. చివరకు ద్రోహం 

నాలుగు సంవత్సరాల క్రితం గోవర్ధన్, సరిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు జన్మించాడు. అందమైన సంసారం, అల్లారుముద్దుగా పెరుగుతున్న బిడ్డతో అంతా సవ్యంగా సాగుతోందని గోవర్ధన్ భావించాడు. కానీ సరిత మనసులో మాత్రం మరో ఆలోచన ఉంది. భర్తను, బాధ్యతను గాలికొదిలేసి ఆమె వేరే దారి చూసుకుంది. అయితే ఆమె చేసిన దారుణం అక్కడితో ఆగలేదు. కన్నబిడ్డను అమ్మేసే స్థాయికి దిగజారిపోవడమే ఈ కథలో అసలైన విషాదం.

 బిడ్డను అమ్మేసి.. మరో పెళ్లి                   

సరిత రహస్యంగా తన బాబును మరొకరికి విక్రయించి, ఆ డబ్బుతో ఇంకొకరిని వివాహం చేసుకుంది. కొద్దిరోజుల క్రితం ఈ దారుణం గోవర్ధన్ దృష్టికి వచ్చింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య తనను మోసం చేయడమే కాకుండా, కన్నప్రేమను కూడా వ్యాపారం చేసిందని తెలిసి ఆయన కుప్పకూలిపోయారు. బిడ్డ ఎక్కడ ఉన్నాడో తెలియక, తన జీవితం అగాధంలో పడిపోయిందని గ్రహించిన గోవర్ధన్, తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. మరణించే ముందు గోవర్ధన్  తన భార్య సరిత చేసిన మోసాన్ని, బాబును విక్రయించిన వైనాన్ని కన్నీళ్లతో వివరిస్తూ వాంగ్మూలాన్ని వీడియో తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  నీకంటూ ఒక మనసు ఉందా? కన్న బిడ్డను ఎలా అమ్మేస్తావు?" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం చూసేవారిని కలిచివేస్తోంది. ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత నాలుగు రోజుల క్రితమే ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.                  

సరిత కోసం పోలీసు ల గాలింపు                                                  
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోవర్ధన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న సరిత కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక యువకుడి ప్రాణం పోవడానికి, ఒక పసిపాడి భవిష్యత్తు అంధకారం కావడానికి కారణమైన సరితపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Embed widget