ఆగస్ట్ 21న MIRAI చిత్రం జపాన్‌లో 'Mirai: Unmei no Senshi' (ది వారియర్ ఆఫ్ డెస్టినీ) పేరుతో విడుదలై సంచలనం సృష్టించింది.
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Mirai Advance Boooking: తేజ సజ్జా నటించిన మిరాయ్ జపాన్‌లో సంచలనం సృష్టిస్తోంది. ‘Mirai: Unmei no Senshi’ పేరుతో విడుదలైన ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో బాహుబలి 2, ధురంధర్ 2 లను వెనక్కి నెట్టింది

- సూపర్ హీరో తేజ సజ్జా 'మిరాయ్' జపాన్‌లో సంచలనం సృష్టిస్తోంది.
- జపాన్ అడ్వాన్స్ బుకింగ్‌లలో బాహుబలి-2ను 'మిరాయ్' అధిగమించింది.
- విజువల్స్, కథనం, బౌద్ధ అంశాలు జపనీయులను బాగా ఆకర్షించాయి.
- పురాణ నేపథ్యం, జపాన్ సన్నివేశాలు సినిమాకు అదనపు బలం.
MIRAI Japan Release: సూపర్ హీరో తేజ సజ్జా మరోసారి వండర్ క్రియేట్ చేస్తున్నాడు. గతేడాది బాక్సాఫీస్ దగ్గర సైలెంట్‌గా సూపర్ హిట్ అందుకున్న విజువల్ వండర్ మిరాయ్’ (MIRAI) ఇప్పుడు జపాన్‌లో సంచలనం సృష్టిస్తోంది.
భారీ అంచనాలు లేకుండా మార్కెట్‌లోకి వచ్చి.. ప్యాన్ ఇండియా స్థాయిలో డీసెంట్ హిట్ కొట్టిన మూవీ MIRAI. తేజ సజ్జా నటించిన ఈ విజువల్ వండర్ దేశవ్యాప్తంగా 150కోట్లకుపైగానే వసూళ్లు చేసింది. ఆ సినిమా స్కేల్‌కు అది బిగ్గెస్ట్ హిట్ కిందే లెక్క. అయితే ఇప్పుడు MIRAI విదేశాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్ట్ 21న జపాన్‌లో ‘Mirai: Unmei no Senshi’(The Warrior of Destiny) పేరుతో వచ్చిన మూవీ సంచలనం సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్‌లో జపాన్‌లో బాహుబలి-2ను మించిపోయిందన్నది ట్రేడ్ రికార్డ్.
బాహుబలి 2, ధురంధర్ 2లను దాటేసిన బుకింగ్స్!
ప్యాన్ ఇండియన్ సినిమాలకు.. ముఖ్యంగా మైతలాజికల్, హిస్టారికల్ మూవీస్‌కు జపాన్‌లో లభిస్తున్న ఆదరణ అద్భుతంగా ఉంటోంది. మన సినిమాలన్నీ అక్కడ బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. ఇండియాలో లాస్ట్ ఇయర్ సైలంట్ హిట్ కొట్టిన MIRAI జపాన్‌లో భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. జపాన్‌లో భారతీయ సినిమాల Day-1 అడ్వాన్స్ బుకింగ్స్‌ను పరిశీలించిన ట్రాకర్ల ప్రకారం.. ‘మిరాయ్’ టాప్-6 పొజిషన్‌ను దక్కించుకుంది. అంతేకాదు, అడ్వాన్స్ టికెట్ సేల్స్ విషయంలో బాహుబలి 2, ధురంధర్ 2, టైగర్ జిందా హై వంటి భారీ మూవీస్‌ను కూడా వెనక్కి నెట్టిందని రిపోర్ట్స్ వచ్చాయి. ఇది సినిమా రిలీజ్‌కు ముందు రిపోర్ట్. మరో రెండు రోజులు గడిస్తే.. అక్కడ ఏ రేంజ్‌లో ఆడుతుందో తెలుస్తుంది.
‘మిరాయ్’కు జపాన్‌లో ఎందుకింత క్రేజ్?
పెద్ద పెద్ద హీరోలకు కూడా రాని ఓపెనింగ్స్ తేజ సజ్జా రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రిలీజ్‌కు ముందు పెద్దగా బజ్ లేని ఈ సినిమాలో కథనం, విజువల్స్. ప్రొడక్షన్ గ్రాండియర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ రేంజ్‌లో విజువల్ గ్రాఫిక్స్ ఉంటాయని జనం ఊహించలేదు. దాంతో ఇండియన్ మార్కెట్‌లో సినిమా మంచి హిట్‌గానే నిలిచింది. ఇప్పుడు జపాన్ మార్కెట్‌లో ఇండియాలో హిట్ అయిన మైథలాజికల్, హిస్టారికల్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. తేజ సజ్జ హనుమాన్ కూడా జపాన్‌లో బాగానే నడిచింది. ఆ పరిచయం ‘మిరాయ్’కు కొంత ప్లస్‌గా మారినట్లు ట్రేడ్ కథనాలు విశ్లేషిస్తున్నాయి.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ‘మిరాయ్’ కథలో అశోక చక్రవర్తి కాలం నాటి పురాణ నేపథ్యం కీలకం. మానవుడిని దేవుడిగా మార్చగల శక్తి ఉన్న తొమ్మిది పవిత్ర గ్రంథాల ఆధారంగా కథనం నడుస్తుంది.వాటి శక్తిని దక్కించుకుని ప్రపంచాన్ని చీకటిలోకి నెట్టాలని ప్రయత్నించే బ్లాక్ స్వోర్డ్‌కు ఎదురుగా.. తేజ సజ్జా పోషించిన వేద ‘సూపర్ యోధ’గా మారి పోరాటం సాగిస్తాడు. కథలో భాగంగా కొన్ని జపాన్‌కు సంబంధించిన సన్నివేశాలున్నాయి. అలాగే ఇందులో చూపించిన బుద్ధిజం కూడా జపాన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
జపాన్ మార్కెట్‌లో మరో మెట్టు!
RRR, బాహుబలి, KALKI, పుష్ప 2, దేవర, సలార్ వంటి సినిమాలు ఇప్పటికే జపాన్‌లో భారతీయ సినిమాలకు మార్కెట్‌ను ఏర్పాటు చేశాయి. ఆ జాబితాలో ఇప్పుడు తేజ సజ్జా ‘మిరాయ్’ కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Frequently Asked Questions
MIRAI సినిమా జపాన్‌లో ఏ పేరుతో విడుదలైంది?
జపాన్‌లో MIRAI ముందస్తు బుకింగ్స్ ఎలా ఉన్నాయి?
జపాన్‌లో భారతీయ సినిమాల Day-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో MIRAI టాప్-6 స్థానాన్ని దక్కించుకుంది. బాహుబలి 2 వంటి భారీ చిత్రాలను కూడా అధిగమించింది.
జపాన్‌లో 'మిరాయ్'కు ఎందుకింత క్రేజ్?
ఈ సినిమా కథలో అశోక చక్రవర్తి కాలం నాటి పురాణ నేపథ్యం, జపాన్‌కు సంబంధించిన సన్నివేశాలు, బుద్ధిజం అంశాలు జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తేజ సజ్జ గత సినిమా 'హనుమాన్' కూడా దీనికి పరిచయం పెంచింది.
ట్రెండింగ్ వార్తలు





















