'ముగ్గురు కోతులు' ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. తెలుగు ప్రేక్షకులు కామెడీ సినిమాలను ఆదరిస్తారని చిత్ర బృందం నమ్ముతోంది.
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Mugguru Kothulu First Look: శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో రూపొందుతున్న కామెడీ సినిమా 'ముగ్గురు కోతులు'. కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

- 'ముగ్గురు కోతులు' ఫస్ట్ లుక్ విడుదలైంది, ఇది హాస్యభరిత చిత్రం.
- తేజ, గణేష్, దేవాన్ష్ హీరోలు; కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
- శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్నారు, చిత్రీకరణ శరవేగంగా ప్రస్తుతం కొనసాగుతోంది.
Mugguru Kothulu First Look Released: ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన సినిమాలు వచ్చిన ప్రతిసారీ తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కొత్త హీరోలు చేసినా కలెక్షన్లు ఇచ్చారు. ఆ నమ్మకంతో మరో కామెడీ సినిమా 'ముగ్గురు కోతులు' రూపొందుతోంది.
కిటికీ లోనుంచి 'ముగ్గురు కోతులు'
తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ హీరోలుగా రూపొందుతున్న సినిమా 'ముగ్గురు కోతులు'. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో శోభారాణి గరిమెల్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సంస్థ నిర్మాణ భాగస్వామి. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వర్షిక పాశం హీరోయిన్.
'ముగ్గురు కోతులు' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టు ముగ్గురు హీరోల పాత్రల్ని చూపించారు. కిటికీ లోనుంచి వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా 'ముగ్గురు కోతులు' తెరకెక్కుతోందని దర్శక నిర్మాతలు చెప్పారు. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని, ఫస్ట్ లుక్ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేస్తోందని, మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్ర బృందం పేర్కొంది.
Mugguru Kothulu Cast And Crew: తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ముగ్గురు కోతులు' సినిమాకు కూర్పు: జమీర్ షేక్, ఛాయాగ్రహణం: రాజ్ నోముల, సంగీతం: ఎస్. సుహాస్, సమర్పణ: జీఎస్ఆర్ క్రియేషన్స్, సహ సమర్పణ: స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్, నిర్మాత: శోభారాణి గరిమెల్ల, దర్శకుడు: కార్తీక్ గరిమెల్ల.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Frequently Asked Questions
'ముగ్గురు కోతులు' సినిమా జానర్ ఏమిటి?
'ముగ్గురు కోతులు' సినిమాలో ప్రధాన నటీనటులు ఎవరు?
తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ఈ సినిమాలో హీరోలు. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తోంది.
'ముగ్గురు కోతులు' సినిమా దర్శకుడు మరియు నిర్మాత ఎవరు?
కార్తీక్ గరిమెల్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శోభారాణి గరిమెల్ల జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో సినిమాను నిర్మిస్తున్నారు.
'ముగ్గురు కోతులు' సినిమాకు ఇటీవల విడుదలైన అప్‌డేట్ ఏమిటి?
'ముగ్గురు కోతులు' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచుతోందని చిత్ర బృందం పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు





















