అవును, యాంకర్ వర్షిణి సౌందరరాజన్ 'బిగ్ బాస్ 10' హౌస్‌లో అడుగు పెడుతున్నట్లు సమాచారం. ఆమె పేరు సెలబ్రిటీ కేటగిరీ లిస్టులో ఉందని తెలిసింది.
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'లో యాంకర్ ఎంట్రీ... సెలబ్రిటీ లిస్టులో గ్లామర్ లేడీ కన్ఫర్మ్
Bigg Boss 10 Telugu Contestants: 'బిగ్ బాస్ 10' స్టార్టింగ్ డేట్ దగ్గర పడే కొలదీ... ఇంటిలో అడుగు పెట్టబోయే సెలబ్రిటీల లిస్ట్ పెరుగుతోంది. కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లలో ఓ లేడీ యాంకర్ ఉన్నారని తెలిసింది.

- బిగ్ బాస్ 10లోకి యాంకర్ వర్షిణి సౌందరరాజన్ ప్రవేశం ఖాయం.
- ఈటీవీ షోలలో యాంకర్‌గా, పలు సినిమాలలో వర్షిణి నటించింది.
- టెంపర్ వంశీ పేరు వినిపించగా, సీరత్, చార్మిల నిరాకరించారు.
Bigg Boss 10 Telugu Contestants 2026 List: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 మొదలు కాబోయే తేదీ దగ్గర పడే కొలదీ... ఆ ఇంటిలో అడుగు పెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరు? 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' నుంచి అవకాశం దక్కించుకునే వాళ్ళను పక్కన పెడితే... ఆ ఇంటి సందడి చేయబోయే సెలబ్రిటీల్లో ఎవరెవరు ఉన్నారు? అనేది తెలుసుకోవాలని వ్యూవర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ల లిస్టులో ఓ ఫిమేల్ యాంకర్, గ్లామర్ లేడీ ఉన్నారని తెలిసింది. ఆమె ఎవరంటే?
'బిగ్ బాస్ 10'లోకి యాంకర్ వర్షిణి సౌందరరాజన్
Varshini Sounderajan Set To Enter Bigg Boss 10 Telugu House: యాంకర్ వర్షిణి సౌందరరాజన్ తెలుసుగా... ఈటీవీ కోసం మల్లెమాల ప్రొడ్యూస్ చేసిన 'జబర్దస్త్', 'పటాస్ 2', 'ఢీ'తో పాటు కొన్ని రియాలిటీ షోలకు యాంకరింగ్ చేశారు. సినిమాల్లో కూడా నటించారు. 'బిగ్ బాస్ 10' హౌస్‌లో ఆమె అడుగు పెడుతున్నారని, ఈసారి సెలబ్రిటీ కేటగిరీ లిస్టులో వర్షిణి పేరు ఉందని తెలిసింది.

వర్షిణి సౌందరరాజన్ ఫ్రెండ్స్ చాలా మంది 'బిగ్ బాస్ 10' ఇంటికి వెళ్ళారు. ఆమెకు ముందు యాంకర్ శ్రీముఖి సైతం 'బిగ్ బాస్' ఇంటికి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'కు హోస్ట్ చేస్తున్నారు. 'జబర్దస్త్'తో పాపులర్ అయినటువంటి ముక్కు అవినాష్, ఇమ్మాన్యుయేల్ వంటి కమెడియన్లు కూడా ఆ ఇంటిలో సందడి చేశారు. మరి వర్షిణి ఏం చేస్తారో చూడాలి. అన్నట్టు... ఆవిడ తెలుగు మాట్లాడారు కానీ పూర్తిగా రాదు. తెలుగులో కొన్ని పదాలు రాకపోవడం వల్ల 'ఢీ' స్టేజిపై వర్షిణిని ప్రదీప్ ఆట పట్టించారు కూడా. ఇప్పుడు 'బిగ్ బాస్' ఇంటిలో ఎలా ఉంటుందో?
'బిగ్ బాస్ 10' తెలుగు కంటెస్టెంట్ల లిస్టులో టెంపర్ వంశీ పేరు కూడా ఉందని తెలిసింది. ఇక ఆ ఇంటికి వెళ్ళడం లేదని హీరోయిన్ సీరత్ కపూర్, యంగ్ అండ్ హ్యాపెనింగ్ ఫిమేల్ యాంకర్ ఆర్జే ఛర్మిల క్లారిటీ ఇచ్చారు.
Varshini Sounderajan Career Background: వర్షిణి సౌందరరాజన్ తమిళమ్మాయి. హైదరాబాద్ సిటీలో సెటిలైన తమిళ కుటుంబంలో జన్మించింది. ఆమెకు ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 'చందమామ కథలు' సినిమాతో తెలుగు తెరపై అడుగు పెట్టారు. ఆ తర్వాత 'లవర్స్'లో హీరోయిన్ రోల్ చేశారు. మళ్ళీ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేశారు. సమంత 'శాకుంతలం'లోనూ వర్షిణి సౌందరరాజన్ నటించారు. ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన 'ఏనుగు తొండం ఘటికాచలం'లో కూడా వర్షిణి నటించారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Frequently Asked Questions
బిగ్ బాస్ 10 తెలుగులోకి వర్షిణి సౌందరరాజన్ ప్రవేశిస్తున్నారా?
వర్షిణి సౌందరరాజన్ గతంలో ఏ షోలకు యాంకరింగ్ చేశారు, ఏ సినిమాల్లో నటించారు?
ఆమె 'జబర్దస్త్', 'పటాస్ 2', 'ఢీ' వంటి షోలకు యాంకరింగ్ చేశారు. 'చందమామ కథలు', 'లవర్స్', 'శాకుంతలం' వంటి సినిమాల్లో కూడా నటించారు.
'బిగ్ బాస్ 10' తెలుగు కంటెస్టెంట్లలో ఇంకెవరి పేర్లు వినిపిస్తున్నాయి?
కంటెస్టెంట్ల లిస్టులో టెంపర్ వంశీ పేరు కూడా ఉందని తెలిసింది. హీరోయిన్ సీరత్ కపూర్, ఆర్జే ఛర్మిల తాము ఇంటికి వెళ్ళడం లేదని స్పష్టం చేశారు.
వర్షిణి సౌందరరాజన్ నేపథ్యం ఏమిటి?
వర్షిణి సౌందరరాజన్ తమిళ అమ్మాయి, హైదరాబాద్ సిటీలో స్థిరపడిన తమిళ కుటుంబంలో జన్మించారు. ఆమెకు అక్క, అన్నయ్య ఉన్నారు.
ట్రెండింగ్ వార్తలు





















