అన్వేషించండి

Sreemukhi: శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు

Sreemukhi Bigg Boss Agnipariksha Trolls: 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లో శ్రీముఖి యాంకరింగ్ విమర్శల పాలు అవుతోంది. తన ఇగోను హర్ట్ చేసిన వాళ్ళకు స్టేజిపై ఇబ్బందులకు గురి చేస్తోందని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బిగ్ బాస్ అగ్నిపరీక్షలో శ్రీముఖి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.
  • రుచితతో శ్రీముఖి దురుసు ప్రవర్తన, అహంకారం స్పష్టంగా కనిపించాయి.
  • న్యాయమూర్తులను ప్రశ్నించిన వారిని షో నుండి తొలగిస్తున్నారని ఆరోపణలు.

Sreemukhi Arrogant Behavior In Bigg Boss Agnipariksha 2 Becomes Talk Of The Town: 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' సీజన్ 2 స్టేజిపై ఉప్పల్ బాలును జడ్జీలు నవదీప్, బిందు మాధవి అవమానించారని సామాన్య వీక్షకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఈ ఏడాది అగ్నిపరీక్షలో కామన్ పబ్లిక్ పట్ల సెలబ్రిటీ జడ్జీలు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలు అవుతోంది. ఇప్పుడు హోస్ట్ శ్రీముఖి సైతం విమర్శల బారిన పడ్డారు. అగ్నిపరీక్షకు వచ్చిన సామాన్యుల పట్ల బుల్లితెర రాములమ్మ పొగరుబోతు ప్రవర్తనతో విరుచుకుపడుతోందని ఆడియన్స్ కొంత మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. 

రుచితతో శ్రీముఖి రూడ్ బిహేవియర్!
Sreemukhi Rude Behaviour On Ruchitha: 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' సీజన్ 2లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్లలో రుచిత ఒకరు. ఆమె పట్ల శ్రీముఖి చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తోంది. శ్రీముఖికి రుచిత నచ్చలేదు. 'బిగ్ బాస్' స్టేజిపై సామాన్యులకు మధ్య మధ్యలో కొన్ని ఆఫర్లు ఇస్తున్నారు. ఆఫర్ అంటే... జడ్జీలను గానీ, యాంకరింగ్ చేస్తున్న శ్రీముఖిని గానీ రోస్ట్ చేయమని. అంటే... వాళ్ళపై జోక్స్ గట్రా వేయవచ్చు. అది నవ్వించడంలో భాగంగా చేయాలి. నవ్వించడం కోసం ఎక్కువ రోస్ట్ చేస్తే అక్కడ సెలబ్రిటీల ఇగో హర్ట్ అవుతోంది. శ్రీముఖి ఇగో హర్ట్ అయ్యింది. దాంతో రుచిత మీద విరుచుకుపడింది.

Also Read: Bigg Boss 10 Telugu - అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ

Sreemukhi: శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు

'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లో భాగంగా రుచితకు ఓ టాస్క్ ఇచ్చారు. ఆమె రెండు కాళ్ళను తాడుతో కట్టేస్తారు. ఆమె నడుచుకుంటూ వెళ్ళాలి. మరీ టైట్‌గా కట్టేస్తే నడవడం ఎలా? అని రుచిత ప్రశ్నించింది. అప్పుడు 'నడవడానికి రావొద్దనే కదా అలా కడుతున్నాం' అని శ్రీముఖి చెప్పింది. 'నా కంఫర్ట్ చెబుతున్నాను' అని రుచిత అంటే... 'ఆమెకు కంఫర్ట్ కావాలి. నువ్వు వెళ్ళిపో. ఎవరికి ఆడాలని ఉంది? ఝాన్సీ నువ్వు రా' అంటూ మరొకరిని పిలిచింది శ్రీముఖి. అలా చెప్పడంలో తప్పు లేదు. కానీ చెప్పేటప్పుడు శ్రీముఖి చెప్పిన విధానంలో రుచితపై ఆమె కోపం కనిపించింది.

Also ReadRavi Teja Irumudi Movie Review In Telugu - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

నవదీప్, బిందు మాధవి, శ్రీముఖిలను ఎవరు అయితే ప్రశ్నిస్తారో... ఎవరు అయితే హర్ట్ చేస్తారో... వాళ్ళను 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' షో నుంచి ఎలిమినేట్ చేస్తున్నారని విశ్లేషకులు, సామాన్య ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. జస్ట్ ఒక్క క్వశ్చన్ వేసినందుకు టాస్క్ లోనుంచి బయటకు పంపించడం దారుణమని చెబుతున్నారు. జడ్జీలు ముగ్గురిలో అభిజీత్ ఒక్కరూ కాస్త బెటర్ అనేది విశ్లేషకుల మాట. ఇంతకు ముందు యాంకరింగ్ విషయంలో శ్రీముఖి ఎప్పుడూ విమర్శల పాలు కాలేదు. కానీ ఈసారి ఆమె ప్రవర్తన పట్ల వీక్షకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Also ReadBrahmanandam Brother Video - అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్

Frequently Asked Questions

శ్రీముఖిపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' సీజన్ 2లో సామాన్య పోటీదారులతో ఆమె పొగరుబోతు ప్రవర్తన కారణంగా విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రుచిత పట్ల ఆమె వ్యవహరించిన తీరు ఆడియన్స్‌కు నచ్చలేదు.

రుచితతో శ్రీముఖి ఎలా ప్రవర్తించింది?

రుచితకు టాస్క్‌లో భాగంగా కాళ్ళు కట్టేయగా, ఆమె నడవడం కష్టమని చెప్పింది. అప్పుడు శ్రీముఖి ఆమె సౌకర్యం కోసం నడవడానికి రాకపోతే వెళ్లిపోవాలని, మరొకరిని పిలవాలని రూడ్‌గా చెప్పింది.

'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లో సెలబ్రిటీ జడ్జీల తీరుపై విమర్శలు ఉన్నాయా?

అవును, ఈ ఏడాది అగ్నిపరీక్షలో నవదీప్, బిందు మాధవితో సహా సెలబ్రిటీ జడ్జీలు సామాన్య ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. సామాన్యులు ప్రశ్నిస్తే వారిని షో నుండి తొలగిస్తున్నారు.

శ్రీముఖి ప్రవర్తన వెనుక కారణం ఏమిటి?

సామాన్యులకు మధ్య మధ్యలో ఇచ్చే ఆఫర్ల ప్రకారం జడ్జీలను, యాంకర్‌ను రోస్ట్ చేసేటప్పుడు, నవ్వించాలనే ఉద్దేశంతో ఎక్కువ రోస్ట్ చేస్తే సెలబ్రిటీల ఇగో హర్ట్ అవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sreemukhi: శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
Bigg Boss 10 Telugu: అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget