Mirai Villain: ఆ హీరోకి 'మిరాయ్'లో విలన్ ఛాన్స్ మిస్... మనోజ్ మంచుకు ముందు ఆప్షన్ ఎవరో తెలుసా?
Mirai Movie Facts: 'మిరాయ్'లో ప్రతినాయకునిగా మనోజ్ మంచు నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఆ పాత్రకు ఆయన ఫస్ట్ ఆప్షన్ కాదు. ఆ ఛాన్స్ మిస్ అయిన యంగ్ హీరో ఎవరో తెలుసా?

బాక్సాఫీస్ బరిలో 'మిరాయ్' కాసుల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో విడుదలైన ఐదు రోజుల్లో 100 కోట్లు వసూలు చేసిందీ సినిమా. కాసులతో పాటు సినిమాలోని క్యారెక్టర్‌లలో నటించిన ప్రతి ఆర్టిస్టుకు పేరు వచ్చింది. మరీ ముఖ్యంగా విలన్ రోల్ చేసిన మనోజ్ మంచు నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఆ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ మనోజ్ కాదని తెలుసా? ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
మనోజ్ పేరు సూచించిన తేజ!
'మిరాయ్'లో మహాబీర్ లామా పాత్రలో మంచు మనోజ్ నటించారు. బ్లాక్ స్మార్ట్ క్యారెక్టర్ చేశారు. సెటిల్డ్ విలనిజం చూపించారు. ఆయన నటన అందరి చేత క్లాప్స్ కొట్టించింది. అయితే... ఆ పాత్రలో తాను అయితే బాగుంటానని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి తన పేరును సూచించినది హీరో తేజా సజ్జా అని మనోజ్ మంచు తెలిపారు.
''బ్లాక్ స్వార్డ్ పాత్రకు మొదట మరో హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan)ను దర్శక రచయితలు అనుకున్నారు. ఆ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ అతనే. కానీ నా తమ్ముడు తేజా సజ్జా నా పేరును ప్రతిపాదించాడు. ఆ తరువాత దర్శకుడు నన్ను సంప్రదించారు'' అని మనోజ్ మంచు తెలిపారు.
View this post on Instagram
'హను - మాన్' తర్వాత మార్పు...
ముందు నుంచి శ్రీరాముడి పాత్ర!
'హను - మాన్' విజయం తర్వాత 'మిరాయ్' క్లైమాక్స్ మార్చినట్టు మనోజ్ మంచు అంగీకరించారు. అయితే కథలో శ్రీరాముడి మాత్రం ముందు నుంచి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Also Read: లోకేష్‌ను పక్కన పెట్టిన రజనీకాంత్...? చెన్నైలో సస్పెన్స్ పెంచిన సూపర్ స్టార్!
''బ్లాక్ స్వార్డ్... నేను పోషించిన పాత్రను శ్రీరాముడు చంపడం అనేది కథలో ముందు నుంచి ఉన్నది. స్క్రిప్ట్ లెవెల్ నుంచి దర్శకుడిలో ఆ ఆలోచన ఉంది. కథలో శ్రీరామచంద్రుని పాత్ర అంతర్భాగం. అయితే 'హను - మాన్' సక్సెస్ తర్వాత పతాక సన్నివేశాలలో చిన్నపాటి మార్పులు చేశారు'' అని తాజా ఇంటర్వ్యూలో మంచు మనోజ్ వివరించారు.'మిరాయ్' తర్వాత తాను విలన్ రోల్స్ చేయడానికి రెడీ అని మంచు మనోజ్ తెలిపారు.
తేజా సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన సినిమా 'మిరాయ్'. ఇందులో శ్రియ శరణ్, వెతికా నాయక్, జగపతి బాబు, మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హీరో స్నేహితుడిగా గెటప్ శ్రీను కనిపించారు. కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా పోలీసులుగా నవ్వించే ప్రయత్నం చేశారు. హరి గౌర అందించిన సంగీతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.





















