Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Horror Thriller Telugu OTT : రీసెంట్ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఒళ్ల గగుర్పొడిచే కంటెంట్‌తో ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Hollywood Horror Thriller Bury The Devil OTT Sudden Streaming : హారర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడని వారుండరు. అందులోనూ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్స్‌కు సూపర్ క్రేజ్ ఉంటుంది. అలాంటి కంటెంట్ ఉన్న రీసెంట్ హారర్ థ్రిల్లర్ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ మూవీ ఏంటంటే...
తెలుగులోనూ స్ట్రీమింగ్
వన్ షాట్ పద్ధతిలో తీసిని ఈ హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ మూవీనే 'బరీ ది డెవిల్' (Bury The Devil). ఈ నేచరల్ హారర్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
ఈ మూవీకి ఆడమ్ ఓబ్రియాన్ దర్శకత్వం వహించగా... ఇమ్మాన్యుయేల్ లుసియర్ మార్టినెజ్, డాన్ ఫోర్ట్, బిల్ రోవాట్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ హారర్ థ్రిల్లర్‌ను ఒంటరిగా మాత్రం చూడొద్దు.
స్టోరీ ఏంటంటే?
'బరీ ది డెవిల్' మూవీని వన్ షాట్ పద్ధతిలోని తీయడం మరో స్పెషల్. ఈ స్టోరీ ఓ నర్స్ చుట్టూ తిరుగుతుంది. జూలియా ఓ హాస్పిన్ నర్స్ (తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని చూసుకునే నర్స్). తీవ్రమైన డిమెన్షియాతో బాధ పడుతున్న ఈవ్లిన్ అనే వృద్ధురాలిని చూసుకోవడానికి జూలియా ఆమె ఇంటికి వెళ్తుంది. ఆ ఇల్లు నగరం వెలుపల చాలా భయానకంగా ఉంటుంది. అయితే, రాత్రి అయ్యే కొద్దీ ఆ వృద్ధురాలి ప్రవర్తన చాలా వింతగా మారుతుంది.
ఆమెకు కేవలం మతిమరుపు మాత్రమే కాదని... ఆమె శరీరంలో ఏదో ఓ దెయ్యం ఉందని జూలియా తెలుసుకుంటుంది. ఆ భయంకరమైన ఇల్లు, వృద్ధురాలి నుంచి జూలియా ఎలా బయటపడింది? అనేదే స్టోరీ.
Also Read : Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















