అన్వేషించండి

Rangareddy News: రెచ్చిపోయిన పోకిరీ గ్యాంగ్ - యువతిపై నీళ్లు, నిలదీసిన తండ్రి గొంతు కోశారు

Telangana News: ఓ యువతిని వేధించిన పోకిరీలను ప్రశ్నించిన తల్లిదండ్రులపై ఆ గ్యాంగ్ దాడికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Gang Attacked on Parents Of Young Girl: రంగారెడ్డి (Rangareddy) జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. తమ కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన యువకున్ని ప్రశ్నించిన తల్లిదండ్రులపై ఓ గ్యాంగ్ దాడికి పాల్పడింది. ఈ క్రమంలో ఆ గ్యాంగ్ లోని ఓ నిందితుడు యువతి తండ్రి గొంతు కోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమలినగర్ లో ఓ యువతి దుకాణానికి వెళ్లగా.. సురేష్ అనే యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. హోలీ రోజు తప్పించుకున్నావంటూ.. ఆమెపై నీళ్లు పోశాడు. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి ఏడుస్తూ ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ప్రశ్నించేందుకు వెళ్లిన తల్లిదండ్రులపై సురేశ్ గ్యాంగ్ దాడికి పాల్పడింది. అనంతరం సురేష్ స్నేహితుడు కత్తితో యువతి తండ్రి గొంతు కోశాడు. అడ్డువచ్చిన యువతి తల్లిపైనా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. సురేష్ తో పాటు అతని గ్యాంగ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితుల నుంచి 4 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరో ఘటన

అటు, ఆస్తి తగాదాల విషయంలో ఓ కొడుకు కన్న తండ్రి గొంతు కోశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బీరెల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనంతయ్య అనే వ్యక్తి చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని కుమారుడు రమేష్ తాగుడుకు బానిసై తండ్రి పేరుపై ఉన్న రెండెకరాలు భూమి అమ్ముకున్నాడు. ఇప్పుడు ఇంటిని కూడా అమ్మాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దీనిపై వారు ససేమిరా అనగా.. తండ్రి గొంతు కోశాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు విషయం తెలపగా.. అనంతయ్యను వికారాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్తి కోసం కొడుకు రమేష్.. తండ్రి గొంతు కోశాడని కుటుంబీకులు ఆరోపించారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం - రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

టాప్ హెడ్ లైన్స్

Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget