By: ABP Desam | Updated at : 05 Jun 2023 10:28 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
- నోట్లు మారుస్తానని వ్యాపారిని నమ్మించి మోసం
- రూ.500 నోట్లు ఇస్తే ఎక్కువ విలువైన రూ.2 వేల నోట్లకు డీల్
- పోలీసుల వేషంలో వచ్చి సినిమా సీన్ తరహాలో దోపిడీ
అత్యాశ అభాసుపాలు చేస్తుందంటారు. దురాశ దుఖం కలిగిస్తుందంటారు. అయితే ఓ వ్యాపారి అత్యాశకు పోయి ఏకంగా అరకోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. అడ్డదారిని ఆశ్రయించి తన డబ్బును రెట్టింపు చేసుకోవాలనుకునే ప్రయత్నం బెడిసికొట్టగా అసలు డబ్బుకే ఎసరు పెట్టినట్లయింది కథ. రూ.2000 నోట్లు రద్దును అవకాశంగా చేసుకున్న కేటుగాళ్లు పోలీసుల్లా వచ్చి నోట్ల మార్పిడి కోసం తెచ్చిన అసలు నోట్లను ఎత్తుకెళ్లారు. విషయం గమనించి లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యాపారి. తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న నోట్ల మార్పిడి మోసం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన మాజేటి లక్ష్మీనారాయణ అనే వ్యాపారికి రూ.50 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే దానికి ప్రతిగా ఇటీవల రద్దు అయిన రూ.2000 నోట్లు రూ.60 లక్షలు ఇస్తారని తనకు తెలిసిన వ్యక్తి చెప్పాడు. దీంతో ఆశపడిన ఆ వ్యాపారి నాలుగు రోజుల క్రితం రూ.50 లక్షల విలువైన రూ.500 నోట్లును తీసుకుని రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్దకు వెళ్లాడు. అక్కడ అప్పటికే ఎదురు చూస్తున్న ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుండగా పోలీసు సైరన్ వేసుకుంటూ ఓ వాహనంలో నలుగురు వ్యక్తులు వచ్చి బెదిరించి వ్యాపారి వద్దనున్న రూ.50 లక్షల బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో బిత్తరపోయిన వ్యాపారి ఏం చేయాలో పాలుపోని స్థితిలో రాజానగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తే చాలంటూ మోసం..
సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అత్యాశలు గురిచేసి ఆపై ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్ స్క్రైబ్ చేసి కొంత మేర పెట్టుబడి పెడితే 30 శాతం కమీషన్ ఇస్తామంటూ ఓ ఉద్యోగిని నమ్మించి రూ.35 లక్షలకు పైగా టోకరా వేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో చోటుచేసుకుంది. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధవళేశ్వరంలోని లక్ష్మీనరసింహ నగర్‌కు చెందిన పల్నాటి శ్రీహరి రైల్వేలో పనిచేస్తున్నాడు. యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేయాలని గతనెల 14న బాధితునికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.. సబ్‌స్క్రైబ్ చేసిన తరువాత రూ.5 వేలు జమ చేస్తే అసలుతోపాటు 30 శాతం కమీషన్ వస్తుందని నమ్మబలికారు. వారు చెప్పిన విధంగానే ముందు రూ.5,000 వారు చెప్పిన ఎకౌంట్‌కు జమచేశాడు. అతని అకౌంట్‌లోకి రూ.6,500 తిరిగి వేశారు. ఇది నమ్మిన శ్రీహరి అనేక సార్లు దఫదఫాలుగా డబ్బులు జమచేయసాగాడు. వారు చెప్పిన విధంగానే తిరిగి డబ్బులు రావడంతో మరింత నమ్మకం కుదిరింది. దీంతో మరింత ఎక్కువ డబ్బు జమచేయడం ప్రారంభించిన శ్రీహరి పలు దఫాలుగా రూ.35,23,440 వరకు జమచేశాడు. పెద్దమొత్తంలో డబ్బు జమ చేసిన తరువాత వారి నుంచి ఎటువంటి సొమ్ము తిరిగి రాకపోవడంతో వారిని సంప్రదించాలని ప్రయత్నిస్తే వారినుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోగా ఫోన్ పనిచేయడం మానేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు బాధితులు ధవళేశ్వరం పోలీసులను ఆశ్రయించాడు.
Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?
స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్
మధ్యప్రదేశ్ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు
Shrirampur Police: పుష్ప సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లింగ్- ఎలా చేశారో తెలిస్తే షాక్
Decomposed Dead Body: కన్నతల్లి అనుమానాస్పదంగా మృతి, 3 నెలలుగా ఇంట్లోనే మృతదేహం
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
/body>