అన్వేషించండి

Kadiyam Police Tortured Youth: దారుణం, మంచి నీళ్లు అడిగితే మూత్రం తాగమని ఎగతాళి చేసిన పోలీసులు!

Kadiyam Police Tortured Dalit Young man: విచారణ పేరిట తనను స్టేషన్‌కు పిలిపించి కడియం పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని చాగల్లు మండలం కుంకుడుపల్లికి దళిత యువకుడు వడ్డి వెంకటప్రసాద్ ఆరోపించారు.

Kadiyam Police Tortured Dalith Man: తూర్పుగోదావరి జిల్లా కడియంలో దారుణ ఘటన జరిగింది. విచారణ పేరిట తనను స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశారని చాగల్లు మండలం కుంకుడుపల్లికి దళిత యువకుడు వడ్డి వెంకటప్రసాద్ ఆరోపించారు. తప్పు చేసింది తాను కాదని చెప్తున్నా వినకుండా పోలీస్​ స్టేషన్‌​కు పిలిపించి చితకబాదారని వాపోయాడు. దాహం వేస్తోంది మంచి నీళ్లు కావాలని అడిగితే మూత్రం తాగమన్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఓ మహిళ అదృశ్యం కేసులో ఈ నెల 17న స్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్సై తీవ్రంగా కొట్టారని వడ్డి వెంకట ప్రసాద్ వాపోయారు. సృహతప్పిన తనకు పైకి లేపి మరీ కొట్టి సంతకం చేయించుకున్నారని, ఆపై తనను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాజమహేంద్రవరం ఆస్పత్రి నుంచి బాధితుడిని డిశ్చార్జ్‌ చేశారు.

అనంతరం బాధితుడు ఏమన్నాడంటే.. ‘నేను నా మిత్రునికి బైక్​ ఇచ్చాను. అతను బండి తీసుకెళ్లి మిస్​యూజ్​ చేశాడు. పోలీసులు నాకు ఫోన్​ చేసి ఓనిగట్ల రమ్మని చెప్పారు. నా దగ్గర రావటానికి ఎలాంటి వాహనం అందుబాటులో లేదని చెప్పాను. బండి పంపిస్తామని చెప్పి పంపించారు. దానిపై అక్కడకు చేరుకున్నాను. మద్యాహ్నం మూడు గంటల సమయంలో నన్ను నుంచి కడియం తీసుకువచ్చారు. రాత్రి 8.30, 9 మధ్యలో సీఐ, ఎస్ఐ వచ్చారు. ఏం జరిగిందని అడిగితే జరిగిన విషయం చెప్పా. తరువాత లోపలికి తీసుకెళ్లి ఇష్టం దుర్భాషలాడారు.’ 

‘ఇష్టం వచ్చినట్లు చేతులపై, చాతిపై, మొహంపై కొట్టారు. కిండ పడిపోతే కానిస్టేబుళ్లు పైకి లేపారు. మరో సారి కొట్టారు. దాహం వేస్తోందని నీళ్లు అడిగితే.. నీళ్లు కాదురా నా మూత్రం తాగు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తరువాత మరొకరిని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. నించోవడానికి వేరే వ్యక్తి సాయం తీసుకుంటే డ్రామాలాడుతున్నావా అంటూ దుర్బాషలాడారు. బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు. బయటకు వచ్చాక ఊపరి ఆడక కింద పడిపోతే పక్కనే ఉన్న ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇంజెక్షన్లు చేసి, ఆక్సిజన్ పెట్టి రాజమండ్రికి తీసుకొచ్చారు’ అంటూ తనకు జరిగిన ఉదంతాన్ని వెంకటప్రసాద్ వివరించాడు.

బాధితుడి భార్య శిరీష మాట్లాడుతూ.. తన భర్తను పోలీసులు తీసుకెళ్లిన విషయం అర్ధరాత్రి చెప్పారని, ఆస్పత్రి వద్దకు వస్తే పోలీసులు లోపలికి అనుమతించలేదని చెప్పారు. కేసు లేకుండా రాజీ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారని, ఎంత డబ్బులైనా ఇస్తామని చెప్పారని అన్నారు. తన భర్తను తీవ్రంగా కొట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని శిరీష డిమాండ్ చేశారు.

ఘటనపై పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. బాధ్యుడైన ఎస్సై శివాజీని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎస్సై శివాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శివాజీనీ వీఆర్ కు పంపించారు. యువకుడిపై పోలీసులు ఎలాంటి థర్డ్‌ డిగ్రీ పద్ధతులు ప్రయోగించలేదని రాజమహేంద్రవరం సౌత్ డీఎస్పీ కె.శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. బాధితుడిని రాజమహేంద్రవరం ఏఎస్పీ రజని ఆస్పత్రిలో పరామర్శించి వివరాలు సేకరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget