అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Cyber Crime: అధిక లాభాలిస్తామంటూ అడ్డగోలు మోసాలు, అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు!

Cyber Crime: పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని చెప్తూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. రోజుకు కనీసం 20 నుంచి 30 మంది ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు.

Cyber Crime: పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మొదట వాట్సాప్, ఫేస్ బుక్, టెక్స్ట్ మెసేజెస్ చేస్తూ.. అమాయకులు ఆకర్షితులయ్యేలా చేస్తారు. పార్ట్ టైం జాబ్స్ పేరిట ఇంట్లో కూర్చుని రోజుకి 10,000 నుంచి 25,000 వేల వరకూ సంపాదించడంటూ మెస్సేజెస్ చేస్తారు. ఒక్కసారి మనం ఆ లింక్ ను క్లిక్ చేసినా, అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసినా ఇక మన పని అయిపపోనట్టే. అలా రోజుకి హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు దాదాపు 20 నుంచి 30 వరకు కేసులు వస్తున్నాయంటే మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే లక్ష రూపాయలు దాటితేనే ఫిర్యాదు చేసేందుకు బాధితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. లక్షకు తక్కువ జరిగిన ఫిర్యాదులు స్థానిక పోలీస్ స్టేషన్ లోనే నమోదవుతాయి. దీని బట్టి రోజుకి కనీసం వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్న మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న వారు పరువు కోసమో లేదా కొంత డబ్బే కదా అని ఫిర్యాదు కూడా చేయడం లేదు. 

300తో మొదలై వేలుకు వెళ్తుంది...

అయితే మొదట జాబ్ పేరుతో లేదా ఏదైనా కంపెనీ బ్రాండ్ ను ఉపయోగిస్తూ రిజిస్ట్రేషన్ పేరుతో 300 కట్టమని కోరతారు. అలా మొదలైన వ్యవహారం ఇంకో 3000 పంపమని మళ్లీ అడుగుతారు. ఆ తరవాత ఖాత మొత్తం ఖాళీ అయ్యేదాక నమ్మిస్తూ ఉంటారు. డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఈ మోసం బయట పడుతుంది. అయితే గృహిణులు ఎక్కువగా ఇలాంటి మోసాల బారిన పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఏదైనా పని చేసుకుందామనుకొని ఆన్ లైన్ లో ఆకర్షణీయంగా కనిపించిన లింక్ లను క్లిక్ చేస్తూ.. మోసగాళ్ల మాయలో పడుతున్నట్లు వివరిస్తున్నారు. 

ముక్కూ, మొహం తెలియని వాళ్లకు అస్సలే డబ్బు పంపించొద్దు..

లాకే డౌన్ తరవాత ఇటువంటి మోసాల సంఖ్య అధికమైంది. ఎప్పుడైనా, ఎవరైనా సరే ఉద్యోగం పేరుతో డబ్బు అడిగితే అది కచ్చితంగా మోసపురితం అని గ్రహించాలి. అదే విదంగా ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఒకసారి డబ్బు కట్టాక.. మళ్లీ మళ్లీ పెద్ద మోతాదులో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయమని అడిగితే మీరు మోసపోతున్నట్లు గుర్తించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగులను, హౌస్ ఫైవ్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం పేరుతో మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ముక్కూ, మొహం తెలియని వాళ్లకు డబ్బులు పంపించకూడదని పేర్కొంటున్నారు. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే తమను ఆశ్రయించాలని కోరారు. అప్పుడే ఇలాంటి మోసాలను అడ్డుకోగలం అని తెలిపారు. ముఖ్యంగా యువత ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి మోసాలకు గురవకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. 

Hyderabad: డేటింగ్ యాప్స్ పేరుతో వ్యాపారికి కోటి 50 లక్షల టోకరా, నిందితుడు అరెస్ట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget