Chittor Crime : ఒంటిపై ఖాకీ.. ఒంట్లో కామం ! చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ కామాంధుడు !
చిత్తూరు జిల్లాలో ఓ కానిస్టేబుల్ కామాంధుని అవతారం ఎత్తాడు. రక్షించాల్సిన స్థానంలో ఉండి శారీరక అవసరాలు తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి కేసుల పాలయ్యాడు.
![Chittor Crime : ఒంటిపై ఖాకీ.. ఒంట్లో కామం ! చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ కామాంధుడు ! Chittor Constable Sexuvally Harassed A Married Woman - complained to the police Chittor Crime : ఒంటిపై ఖాకీ.. ఒంట్లో కామం ! చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ కామాంధుడు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/01/c45bca5051b6bb59deb3b25e9c79fc1a_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పేరుకు అతని కానిస్టేబుల్. ఒంటి మీద ఖాకీ డ్రెస్ ఉంటుంది. కానీ ఓంట్లో మాత్రం నిలువెల్లా కామమే ఉంటుంది. కాస్త పరిచయం చేసుకుంటే చాలు ఇక కోరిక తీర్చమని వెంట పడటమే ఆ ఖాకీ కామాంధుని నైజం. ఖాకీ డ్రెస్‌ను చూసి చాలా మంది భయపడినా ఎప్పుడైనా పాపం బయటపడక మానదు. ఆ చిత్తూరు జిల్లా ఖాకీ పాపం ఇప్పుడు బయటపడింది.
Also Read : కలెక్టర్ ఇంట్లో దొంగతనం.. లేఖ వదిలి వెళ్లిన దొంగలు, రాసింది చూసి విస్తుపోయిన అధికారి
చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసు స్టేషన్‌లో సోమశేఖర్ అనే విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అతను నిజంగానే సోమరేమో కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న మహిళలపై కన్నేసి ఉంచడంలో మాత్రం చాలా నేర్పరి. ఈ సోమశేఖర్ గంగవరం మండలం సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. వారు ఉంటున్న అపార్టుమెంట్‌లోనే మరో కుటుంబం నివాసం ఉంటోంది. అపార్టుమెంట్ కావడంతో చిన్నా చితకా వేడుకలు కూడా కలిసే నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వారితో పరిచయం పెంచుకున్నాడు సోమశేఖర్. తాను కానిస్టేబుల్‌నని.. తనకు అడ్డే ఉండదని గొప్పలు పోయేవాడు.
Also Read : కన్న బిడ్డల్ని ఉరేసి చంపిన తల్లి.. కారణం తెలిసి అవాక్కైన బంధువులు, స్థానికులు
కొద్ది రోజులు మాట్లాడిన తర్వాత నేరుగా వాళ్లింటికి వెళ్లి కూర్చోవడం ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత వెకిలిగా మాట్లాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత కోరిక తీర్చాలని ఆ కుటుంబంలోని మహిళను వేధించడం ప్రారంభించాడు. తాను పోలీస్‌నని ఎవరికి చెప్పుకున్నా ఎవరూ ఏం చేయలేరని.. కానీ ఎవరికైనా చెబితే మాత్రం సంగతి చూస్తానంటూ హెచ్చరించేవాడు. వీడియో కాల్స్ చేసి న్యూడ్‌గా మాట్లాడమని బెదిరించేవారు. ఇలా చేయవద్దని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా వినిపించులేదు. చివరికి కానిస్టేబుల్ కుటుంబసభ్యులకు చెప్పి చూశారు. వారు కూడా పట్టించుకోలేదు.
Also Read: భార్యపై కోపం.. అత్తామామలకు నిప్పుపెట్టిన అల్లుడు.. కేపీహెచ్‌బీలో దారుణం
ఇక కానిస్టేబుల్ కామాంధుడి నుంచి రక్షించకోవాలంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం ఒక్కటే మార్గామని నిర్ణయించుకుని సోమశేఖర్ పని చేస్తున్న స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కొద్ది నెలలుగా సోమశేఖర్ అసభ్యకరమైన మెసేజులను సాక్ష్యాలుగా ఇచ్చింది. అయితే అప్పుడు డ్యూటీలోనే ఉన్న కానిస్టేబుల్ వివాహితతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆ వివాహితకు భరోసా ఇచ్చిన ఎస్సై సుధాకర్ సోమశేఖర్ పై కేసు నమోదు చేశారు. సోమశేఖర్ పై చర్యలకు పోలీసు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.
Also Read: పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం ... వైరల్ అయిన వీడియో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)