News
News
వీడియోలు ఆటలు
X

Rajamundry: కన్న బిడ్డల్ని ఉరేసి చంపిన తల్లి.. కారణం తెలిసి అవాక్కైన బంధువులు, స్థానికులు

ఆదివారం రాత్రి కుమార్తె ఎనిమిదేళ్ల చిన్మయి, కొడుకు ఆరేళ్ల మోహిత్‌‌ను తల్లి ఇంట్లో ఉరివేసి చంపేసిందని స్థానికులు, బంధువులు వెల్లడించారు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

FOLLOW US: 
Share:

ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రేమతో కూడిన సంబంధం ఏ జీవికైనా తల్లితోనే ఉంటుంది. మనసు బాధపడితే ముందుగా గుర్తుకొచ్చేది కన్నతల్లే. అలాంటి అమ్మే కన్న బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తే.. అలాంటి ఘటనే రాజమహేంద్రవరంలో జరిగింది. ఇద్దరు బిడ్డల్ని కన్నతల్లే కడతేర్చింది. వారికి ఉరి వేసి ప్రాణాలు తీసింది. సభ్య సమాజం తలవంచుకొనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..

రాజమహేంద్రవరం పట్టణంలోని ఆనంద్‌ నగర్‌లో ఈ ఘటన జరిగింది. తాడేపల్లికి చెందిన అనూష అనే మహిళ భర్త 13 ఏళ్ల కిందట చనిపోవడంతో రాజమండ్రికి వచ్చి బ్యూటీషియన్‌గా పనిచేస్తూ ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల పిల్లల విషయంలో ఆమె తల్లితో కూడా గొడవ పడింది. పిల్లల్ని కొట్టద్దని అడ్డు వచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను సైతం అనూష గాయపర్చింది. దీంతో ఆమె చెయ్యి గూడు విరగడంతో తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై లక్ష్మి అనూష సోదరులు వారి మేనమామకు సమాచారం అందించడంతో వారు లక్ష్మీ అనూషకు ఫోన్ చేసి మందలించారు.

Also Read: నిద్రపోతున్న ఫ్యామిలీపై కూలిన పైకప్పు.. శాశ్వత నిద్రలోకి ఐదుగురు.. సీఎం దిగ్భ్రాంతి

ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కుమార్తె ఎనిమిదేళ్ల చిన్మయి, ఆరేళ్ల మోహిత్‌‌ను ఇంట్లో ఉరివేసి చంపేసిందని స్థానికులు, బంధువులు వెల్లడించారు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం చిన్నారుల మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి మూడో పట్టణ పోలీసులు నిందితురాలు అనూషను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం అనూష ప్రియుడికి ఫోన్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. 

పిల్లల్ని చంపేసినట్లుగా బంధువులకు కూడా ఫోన్ చేసి తెలపడంతో వారు ఆగమేఘాలపై ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో అనూష ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా వారు నిరోధించారు. అనంతరం చనిపోయిన పిల్లల్ని అనుష్కను 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి పిల్లలను హతమార్చిందా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో తాము విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Also Read: నిజామాబాద్ చిన్నారి ఆచూకీ లభ్యం... మహారాష్ట్రలో పాపను వదిలివెళ్లిన కిడ్నాపర్లు...

Also Read: పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం ... వైరల్ అయిన వీడియో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Oct 2021 09:32 AM (IST) Tags: rajamahendravaram Mother Kills Kids Hanging in Rajamundry Mother murders kids illegal affairs News

సంబంధిత కథనాలు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Ongole News: ఒంగోలులో విషాదం - తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Ongole News: ఒంగోలులో విషాదం - తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

టాప్ స్టోరీస్

పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్‌ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్‌ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?

WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?