Hyderabad: భార్యపై కోపం.. అత్తామామలకు నిప్పుపెట్టిన అల్లుడు.. కేపీహెచ్‌బీలో దారుణం
భర్త యాసిడ్ పోసేందుకు వచ్చాడనుకొని నీతిక బెడ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఈ క్రమంలో నీతిక తండ్రి సాగర్ రావు.. అల్లుడిని అడ్డుకునేందుకు వెళ్లగా అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
![Hyderabad: భార్యపై కోపం.. అత్తామామలకు నిప్పుపెట్టిన అల్లుడు.. కేపీహెచ్‌బీలో దారుణం Hyderabad: Son in law attempts murder on Aunt Uncle in KPHB Colony after anger on Wife Hyderabad: భార్యపై కోపం.. అత్తామామలకు నిప్పుపెట్టిన అల్లుడు.. కేపీహెచ్‌బీలో దారుణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/04/273c2ae4d1c42355705eba0f64c71504_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భార్యపై కోపం పెంచుకున్న ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈలోపు ఆమె తల్లిదండ్రులు అడ్డు రావడం వల్ల వారికి గాయాలై చివరికి ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. భార్యపై పెట్రోల్ పోసేందుకు యత్నించగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన అనంతరం నిందితుడు పారిపోయాడు. తొలుత నిందితుడి మామకు మంటలు అంటుకోగా.. వాటిని ఆర్పేందుకు యత్నించిన అత్తకు కూడా గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
Also Read: వాహనదారులకు షాక్! తగ్గని ఇంధన ధరలు.. మరింత ఎగబాకుతూ అత్యంత గరిష్ఠానికి..
కేపీహెచ్‌బీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 6వ ఫేజుకు చెందిన టి.సాగర్‌రావు, రమా నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె నీతికకు కరీంనగర్‌కు చెందిన సాయి కృష్ణతో 2017లో పెళ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహం. దాదాపు ఏడాది పాటు వీరి సంసారం సంతోషంగా సాగింది. తర్వాత భర్త సాయికృష్ణ భార్య నీతికను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడని పోలీసులు తెలిపారు. భర్త వేధింపులు తట్టుకోలేక 2019లో నీతిక తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. అదే సమయంలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో భర్త వేధింపులు, తీరుపై ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడంతో అప్పటి నుంచి నీతిక తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ ఉంది.
Also Read: కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు బిగ్ రిలీఫ్
అయితే, శనివారం రాత్రి 11 గంటల సమయంలో సాయి కృష్ణ పెట్రోల్ బాటిల్‌తో ఇంటికి వచ్చాడు. యాసిడ్ పోసేందుకు ఇంటికి వచ్చాడనుకొని భయపడిని నీతిక బెడ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అతను తలుపులు తెరిచే క్రమంలో నీతిక తండ్రి సాగర్ రావు... అల్లుడిని అడ్డుకునేందుకు వెళ్లగా అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సాగర్ రావు తీవ్రంగా గాయపడ్డాడు. అత్త రమ మంటలను చూసి బిగ్గరగా అరిచింది.
దీంతో అక్కడి నుంచి సాయికృష్ణ పరారయ్యాడు. వెంటనే స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా రమకు కూడా కాలిన గాయాలు అయ్యాయి. దీంతో సాగర్ రావు, రమలను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
Also Read: దసరా పండగకి ప్రత్యేక రైళ్లు... ప్రకటించిన ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే... వివరాలు ఇలా..
Also Read: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. భారీ బోనస్ ప్రకటించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)