News
News
వీడియోలు ఆటలు
X

7th Pay Commission: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. భారీ బోనస్ ప్రకటించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

Bonus For Railway Employees: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త అందించింది. అర్హులైన వారికి బోనస్ ఇవ్వనున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

FOLLOW US: 
Share:

7th Pay Commission Latest News: ఆ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పండుగ బోనస్ ప్రకటించింది. రైల్వే ఉద్యోగులలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన వారికి బోనస్ ఇవ్వనున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దాదాపు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించాలని కేంద్ర ప్రభుత్వం ఈ మేర నిర్ణయం తీసుకుంది.

నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులలో ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ సిబ్బందికి ఈ బోనస్ వర్తించదని క్లారిటీ ఇచ్చారు. దీపావళి బోనస్ మొత్తంగా 11.56 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా.. భేటీ అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.

Also Read: మామ ఆస్తిపై హక్కు కోసం కోర్టును ఆశ్రయించిన అల్లుడు.. హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే!

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ అందిస్తోంది. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలి. కానీ ప్రధాని మోదీ, కేబినెట్ 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించి వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బోనస్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.1,985 కోట్ల మేర బారం పడనుందని అనురాగ్ ఠాగూర్ తన ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ దసరా పండుగ నేపథ్యంలో నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి అందించిన సేవలకుగానూ ఈ బోనస్ అందుకోనున్నారు.

Also Read: కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు బిగ్ రిలీఫ్

దేశ వ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కుల ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. కరోనా వ్యాప్తి కారణంగా గత ఏడాది కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్‌లను నిలిపివేయడం తెలిసిందే. మూడు దఫాలుగా వాయిదా పడిన డీఏను కేంద్రం జూన్ నెలలో అమోదించింది. డీఏను 17 శాతం నుంచి 25శాతానికి పెంచింది. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Oct 2021 04:17 PM (IST) Tags: 7th Pay Commission Railway Employees Union Minister Anurag Thakur Bonus For Railway Employees

సంబంధిత కథనాలు

India GDP: భారతదేశ జీడీపీ అంచనాలో కోత పెట్టిన ప్రపంచ బ్యాంక్‌

India GDP: భారతదేశ జీడీపీ అంచనాలో కోత పెట్టిన ప్రపంచ బ్యాంక్‌

Weather Report: రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా బిపార్జోయ్ - ఏయే రాష్ట్రాలపై ప్రభావం ఉందంటే?

Weather Report: రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా బిపార్జోయ్ - ఏయే రాష్ట్రాలపై ప్రభావం ఉందంటే?

Aadhar: పూర్తి ఉచితంగా ఆధార్‌ అప్‌డేషన్‌, కొన్ని రోజులే ఈ ఆఫర్‌

Aadhar: పూర్తి ఉచితంగా ఆధార్‌ అప్‌డేషన్‌, కొన్ని రోజులే ఈ ఆఫర్‌

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్

Madhya Pradesh: మరో రైలు ప్రమాదం, అదుపు తప్పి కింద పడిపోయిన గూడ్స్ వ్యాగన్‌లు

Madhya Pradesh: మరో రైలు ప్రమాదం, అదుపు తప్పి కింద పడిపోయిన గూడ్స్ వ్యాగన్‌లు

టాప్ స్టోరీస్

AP Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్- ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Cabinet Decisions:  ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్-  ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

Bail For Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Bail For Magunta Raghava :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

ఆ పార్టీలో మహేష్ భార్య నమ్రత ధరించిన కుర్తా అంత ఖరీదా?

ఆ పార్టీలో మహేష్ భార్య నమ్రత ధరించిన కుర్తా అంత ఖరీదా?