అన్వేషించండి

Andhra Pradesh Year Ender 2025: ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో 2025ది ప్రత్యేక స్థానం - ఇవిగో టాప్ టెన్ మైలురాళ్లు

Year Ender 2025: ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో 2025ది ప్రత్యేక స్థానం. అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీకి వచ్చాయి. పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భోగాపురం విమానాశ్రయం, దేశ తొలి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు కానున్నాయి.

2025 holds a special place in Andhra Pradesh growth story:  2025వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి , పారిశ్రామిక వృద్ధి పరంగా ఒక మైలురాయిగా నిలిచింది. ప్రభుత్వం 'స్పీడ్ ఆఫ్ బిజినెస్' మంత్రాన్ని అందిపుచ్చుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రాజెక్టులు , పెట్టుబడులు వెల్లువెత్తాయి.

పరుగులు పెడుతున్న అమరావతి అభివృద్ధి 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు ప్రస్తుతం పూర్తి జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకున్న ఈ పనులు వరల్డ్-క్లాస్ గ్రీన్ క్యాపిటల్‌గా మార్చే లక్ష్యంతో జరుగుతున్నాయి.  సెక్రటేరియట్ టవర్లు, హైకోర్టు భవనం, అసెంబ్లీ, ట్రంక్ రోడ్లు  360 కి.మీ , రిజర్వాయర్లు వంటి ముఖ్య నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కోర్ క్యాపిటల్ భవనాలు 2028 నాటికి పూర్తి కానున్నాయి. వరల్డ్ బ్యాంక్ నుంచి రెండో విడతగా  సుమారు రూ.1,700 కోట్లు నిధులు డిసెంబర్‌లో విడుదల కానున్నాయి. మొత్తం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి $1,600 మిలియన్ నిధులతో ఫేజ్-1 పనులు జరుగుతున్నాయి.అక్టోబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐజీబీసీ (IGBC) నెట్ జీరో సర్టిఫికేషన్ పొందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. అలాగే, రాజధాని ప్రాంతంలో రూ. 50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా సీఆర్డీఏ (CRDA) ప్రణాళికలు సిద్ధం చేసింది.
 
విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ 

ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ తన *AI హబ్  ఏర్పాటుకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది.   గూగుల్ తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఏపీలో విస్తరిస్తోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ పవర్డ్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను దశలవారీగా ఏర్పాటు చేయనుంది, దీనికి మొత్తం లక్షన్నర కోట్ల వరకూ  పెట్టుబడి పెట్టనుంది.  ఇది భారత్‌లో గూగుల్‌కు అతిపెద్ద పెట్టుబడిగా నిలుస్తూ లక్షలాది ఉద్యోగాలు సృష్టించి విశాఖను ఏఐ హబ్‌గా మార్చనుంది.

విశాఖ సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్  - రూ. 13.2 లక్షల కోట్ల పెట్టుబడులు

నవంబర్ 2025లో విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడుల జాతరగా నిలిచింది. రెండు రోజుల వ్యవధిలోనే 640 ఎంఓయూల ద్వారా రూ. 13.2 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. దీని ద్వారా సుమారు 16 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా.
 
భోగాపురం విమానాశ్రయం - 90% పనులు పూర్తి

ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2025 చివరి నాటికి 90% పూర్తి చేసుకుంది. డిసెంబర్‌లో నిర్వహించిన వ్యాలిడేషన్ ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతం కావడంతో, 2026 ప్రథమార్ధంలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

రిలయన్స్ 'ఏఐ' (AI) సెంటర్ - రూ. 93,000 కోట్ల పెట్టుబడి

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దాదాపు $11 బిలియన్ల (రూ. 93,000 కోట్లు) పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఐటీ రంగానికి కొత్త దిశను చూపనుంది.

దేశంలోనే మొదటి 'క్వాంటం కంప్యూటింగ్' కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 1 లక్ష కోట్ల నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇది ఏపీని భవిష్యత్ టెక్నాలజీ హబ్‌గా నిలబెట్టనుంది.

 ఎవియేషన్ ఎడ్యుసిటీ  ప్రారంభం

భోగాపురం విమానాశ్రయానికి ఆనుకుని 136 ఎకరాల్లో జీఎంఆర్-మాన్సాస్ ఎవియేషన్ ఎడ్యుసిటీని ప్రారంభించారు. విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయి నిపుణులను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్, విమానయాన శిక్షణలో ఏపీని గ్లోబల్ సెంటర్‌గా మార్చనుంది.
 
సెమీకండక్టర్ సెంటర్ - రూ. 765 కోట్ల ప్రాజెక్ట్

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీమ్ కింద ఏపీలో సుమారు రూ. 765 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఆమోదించింది.

 ఎస్ఐపీబీ (SIPB) ద్వారా రూ. 1.01 లక్షల కోట్ల ఆమోదాలు

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 2025లో నిర్వహించిన సమావేశాల్లో దాదాపు 26 భారీ పరిశ్రమలకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు (Incentives) ఎటువంటి ఆలస్యం లేకుండా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఆటోమేటిక్ ఎస్క్రో సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకాన్ని భారీగా పెంచింది.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget