అన్వేషించండి

Father In Law Property Right: మామ ఆస్తిపై హక్కు కోసం కోర్టును ఆశ్రయించిన అల్లుడు.. హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే!

Son In Law Property Right: కుమార్తెలు ఎన్నటికీ కుమార్తెలనీ, కానీ కుమారులు మాత్రం పెళ్లి తరువాత గతంలో తరహాలో ఉండరని బాంబే కోర్టు ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి తన మామ ఆస్తిపై హక్కు కోరాడు.

తండ్రి ఆస్తిపై కుమారుడితో పాటు కూతురికి హక్కులు ఉంటాయా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కోర్టులో సైతం పలు కేసుల విచారణలో భాగంగా కుమార్తెకు హక్కులు ఉంటాయని ధర్మాసనాలు పేర్కొన్నాయి. తాజాగా మరో ఆసక్తికర ఆస్తి కేసు విచారణ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుమార్తెలు ఎన్నటికీ కుమార్తెలనీ, కానీ కుమారులు మాత్రం పెళ్లి తరువాత గతంలో తరహాలో ఉండరని బాంబే కోర్టు ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది. తాజాగా ఓ వ్యక్తి తన మామ ఆస్తిపై తనకు హక్కులు కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అతడికి ఎలాంటి హక్కులు ఉండవంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.

మామ ఆస్తిపై తనకు హక్కులు కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. మామ ఆస్తిపై అల్లుడికి ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండవని స్పష్టం చేసింది. ఒకవేళ మామ నిర్మించిన ఇల్లు, భవనాలకు డబ్బులు ఖర్చు చేసినా సరే వాటిపై అల్లుడికి ఎలాంటి హక్కులు ఉండవని ధర్మాసనం పేర్కొంది. పయ్యన్నూర్ సబ్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కన్నూర్ తాలిపరంబాకు చెందిన డేవిస్ రాఫెల్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్ అనిల్ కుమార్.. అల్లుడి చట్టపరంగా ఎలాంటి ఆస్తి హక్కు వర్తించదని తీర్పు వెల్లడించారు. దిగువ కోర్టు ఆదేశాలు సరైనవని పేర్కొన్నారు.

Also Read: మూడు రోజుల పని విధానం వైపు బెంగళూరు ఫిన్‌టెక్‌ స్టార్టప్‌.. వేతనాలూ భారీగానే!

అసలేం జరిగిందంటే..
డేవిస్ రాఫెల్ తన ఆస్తిపై కన్నేశాడని అతడి నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని హెండ్రీ థామస్ అనే వ్యక్తి ట్రయల్ కోర్టును ఆశ్రయించాడు. అల్లుడు డేవిస్ రాఫెల్ నుంచి తన ఆస్తిని రక్షిస్తూ, శాశ్వత పరిష్కారం సూచించాలని కోరాడు. త్రిచంబరంలోని సెయింట్ పాల్స్ చర్చి, జేమ్స్ నస్రత్ ద్వారా బహుమతిగా ఓ స్థలం తనకు లభించినట్లు హెండ్రీ పేర్కొన్నాడు. ఆ స్థలంలో తన సొంత ఖర్చులు, కుటుంబ డబ్బులతో ఇంటిని నిర్మించుకున్నాడు. నిర్మాణం పూర్తయ్యాక అందులోనే నివాసం ఉంటున్నట్లు వివరించాడు. తన ఏకైక కుమార్తెను డేవిస్ కు ఇచ్చి వివాహం జరిపించాడు.

Also Read: ఐదేళ్ల క్రితం లక్ష పెడితే ఇప్పుడు 40 లక్షల లాభం! ఆ షేర్‌ ఏంటో తెలుసా?

హెండ్రీ కుటుంబం కోసం చర్చి అధికారులు స్థలం కేటాయించారని, ఆయన కుమార్తెను వివాహం చేసుకుని తాను కూడా కుటుంబసభ్యుడిగా మారినట్లు అల్లుడు డేవిస్ రాఫెల్ వాదిస్తున్నాడు. ఆ ఇంట్లో నివసించే హక్కు తనకు సైతం ఉందని, చట్ట పరంగా ఆస్తిలో హక్కు కల్పించాలని ట్రయల్ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఇరువర్గాల వాదనలు విన్న ట్రయల్ కోర్టు.. అల్లుడికి మామ ఆస్తిలో ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నంత మాత్రాన తనకు ఆస్తిలో వాటా ఉందని వాదిస్తున్న డేవిస్ రాఫెల్ తీరును కోర్టు తప్పుపట్టింది. అల్లుడి చర్యలు సిగ్గుచేటు అని కోర్టు అభిప్రాయపడింది.

Also Read: కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు బిగ్ రిలీఫ్

హైకోర్టును ఆశ్రయించిన అల్లుడు..
దిగువ కోర్టులో తనకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు డేవిస్ రాఫెల్. అయితే మామ హెండ్రీ థామస్ ఇల్లు, ఆస్తిలో అల్లుడు డేవిస్‌కు చట్టపరంగా ఎలాంటి హక్కు ఉండదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ ఆ ఇంటి నిర్మాణంలో నగదు సాయం చేసినా సరే అల్లుడు డేవిస్‌కు చట్టపరంగా ఆస్తిలో వాటా ఉండదని జస్టిస్ ఎన్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు - కారణం ఏంటంటే
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Shami Injury Handling: షమీని సరిగా వాడుకోలేదు.. బీజీటీలో తను ఉంటే లెక్క వేరే ఉండేది.. బీసీసీఐపై మాజీ కోచ్ ఫైర్
షమీని సరిగా వాడుకోలేదు.. బీజీటీలో తను ఉంటే లెక్క వేరే ఉండేది.. బీసీసీఐపై మాజీ కోచ్ ఫైర్
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్ రావాలా?- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్ రావాలా?- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Embed widget