Multibagger stock: ఐదేళ్ల క్రితం లక్ష పెడితే ఇప్పుడు 40 లక్షల లాభం! ఆ షేర్ ఏంటో తెలుసా?
స్టాక్ మార్కెట్లో ఓపికగా పెట్టుబడులు పెడితే కాసుల పంట పండించొచ్చు! ఈ ఫార్మా కంపెనీ ఇందుకు చక్కని ఉదాహరణ. ఐదేళ్ల క్రితం ఇందులో లక్ష రూపాయాల పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు దాదాపు రూ.40 లక్షలు వచ్చుండేవి.
స్టాక్ మార్కెట్లో ఓపికగా పెట్టుబడులు పెట్టి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటే కాసుల పంట పండించొచ్చు! తక్కువ ధరకే కొనుగోలు చేసిన షేర్లు కాలం గడిచే కొద్దీ లక్షల రూపాయాల లాభాన్ని ఇస్తుంటాయి. క్వాలిటీ ఫార్మా (Kwality Pharma) కంపెనీ ఇందుకు చక్కని ఉదాహరణ. ఎందుకంటే ఐదేళ్ల క్రితం ఇందులో లక్ష రూపాయాల పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు దాదాపు రూ.40 లక్షలు వచ్చుండేవి.
Also Read: రెడ్‌మీ కొత్త టీవీల సేల్ నేడే.. రూ.16 వేలలోపే!
క్వాలిటీ ఫార్మా కంపెనీ మదుపర్లకు ఎనలేని లాభాలను తెచ్చిపెట్టింది. ఐదేళ్ల క్రితం (2016, సెప్టెంబర్ 28) ఈ కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో రూ.21.75గా ఉండేది. 2021, అక్టోబర్ 1న ఆ షేరు రూ.878 వద్ద ముగిసింది. అంటే దాదాపు 40 రెట్లు పెరిగింది. ఇంకా చెప్పాలంటే చివరి నెల్లోనే ఈ షేరు ధర రూ.419 నుంచి రూ.878కి చేరుకుంది. దాదాపుగా 110 శాతం ర్యాలీ చేసింది. ఆరు నెలల క్రితం వరకు ఈ షేరు ధర రూ.54గానే ఉండటం గమనార్హం. అంటే అర్ధ సంవత్సరంలోనే 1530 శాతం పెరిగిందన్నమాట. ఇక ఏడాది క్రితం ఈ షేరు ధర రూ.61 మాత్రమే. మొత్తంగా ఐదేళ్ల కాలంలో రూ.21 నుంచి రూ.878 స్థాయికి చేరుకుంది. 3,940 శాతం పెరిగింది.
Also Read: కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు బిగ్ రిలీఫ్
క్వాలిటీ ఫార్మాలో మదుపర్లు ఒక నెల క్రితం లక్ష రూపాయాలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.2.10 లక్షలు చేతికందేవి. అదే ఆరు నెలల క్రితం లక్ష పెట్టుంటే ఇప్పుడు రూ.16.30 లక్షలు వచ్చేవి. అదే ఏడాది క్రితం లక్ష పెట్టు బడి పెడితే ఈనాడు రూ.14.40 లక్షల రాబడి వచ్చేది. పదేళ్ల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో లక్ష పెట్టుంటే ఇప్పుడు రూ.40 లక్షల లాభం వచ్చేది.
Also Read: మహీంద్రా, ఝున్‌ఝున్‌వాలాను మించి 'బైజు' రవీంద్రన్ సంపద
నోట్: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. షేర్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణులు సలహాలు తీసుకోవడం అవసరం! ప్రస్తుతం అందిస్తోన్న మార్కెట్ల సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫలానా స్టాక్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ చెప్పడం లేదు.
Also Watch: దేశంలో టాప్-10 కుబేరులు వీరే, ఆస్తుల వివరాలు ఇలా