Hurun Richest Indian: మహీంద్రా, ఝున్‌ఝున్‌వాలాను మించి 'బైజు' రవీంద్రన్ సంపద
'బైజు' రవీంద్రన్.. బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను మించిపోయాడు. హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ ప్రకారం అతడి సంపద రూ.24,300 కోట్లకు చేరుకుంది.
ఎడ్‌టెక్ కంపెనీల యజమానులు సంపదలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. 'బైజు' రవీంద్రన్, అతడి కుటుంబ సంపద గతేడాదితో పోలిస్తే మరింత పెరిగింది. అంతేకాకుండా బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను అతడు మించిపోయాడు. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ 2021 ప్రకారం రవీంద్రన్ సంపద రూ.24,300 కోట్లకు చేరుకుంది.
Also Read: ఈ షేరులో లక్ష పెట్టుంటే ఆరు నెలల్లో రూ.9.41 లక్షలు చేతికొచ్చేది!
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సంపద రూ.22,300 కోట్లు కాగా ఆనంద్ మహీంద్రా సంపద రూ.22,000 కోట్లుగా ఉంది. హురున్ జాబితాలో రవీంద్రన్ 67 స్థానంలో నిలిచారు. ఐదేళ్ల కాలంలోనే అతడు 504 ర్యాంకులు మెరుగవ్వడం ప్రత్యేకం. అత్యంత వేగంగా ఎదిగిన కోటీశ్వరుడూ ఆయనే కావడం గమనార్హం. 2021లో అతడి సంపద 19 శాతం పెరిగింది. 'జోహో' రాధా వెంబు (రూ.23000 కోట్లు), ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనీ (రూ.20,900) అతడి వెనకాలే ఉన్నారు.
Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం
బైజుస్‌ను రవీంద్రన్ 2011లో స్థాపించారు. ప్రస్తుతం ఆ సంస్థ విలువ 16.5 బిలియన్ డాలర్లుగా ఉంది. మరో 1.5 బిలియన్ డాలర్లను సమీకరించేందుకు సంస్థ పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందని తెలిసింది. అలా జరిగితే సంస్థ విలువ 21 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఐపీఓకు గనక వస్తే విలువ 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మధ్యే రూ.15వేల కోట్లతో మూడు సంస్థలను బైజుస్ విలీనం చేసుకుంది. రూ.7,300 కోట్లతో ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, రూ.4500 కోట్లతో గ్రేట్ లెర్నింగ్, రూ.3700 కోట్లతో ఎపిక్‌ను కొనుగోలు చేసింది.
Also Read: అమెజాన్‌లో అక్టోబర్ 2న వీటిపై డిస్కౌంట్లు.. మీ విష్‌లిస్టులో ఉంటే కొనేయండి!
Also Read: మళ్లీ టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా!.. ఖండించిన ప్రభుత్వం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Delighted that @BYJUS's is partnering us to enhance learnings in #AspirationalDistricts using technology. With their support, we plan to explore the application of innovative EdTech solutions & learning resources to make a quantum jump in learning outcomes in these districts. pic.twitter.com/mwCCWkU98q
— Amitabh Kant (@amitabhk87) October 1, 2021