News
News
X

Amazon Great Indian Festival Sale: రెడ్‌మీ కొత్త టీవీల సేల్ నేడే.. రూ.16 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో లాంచ్ చేసిన 32 అంగుళాల స్మార్ట్ టీవీ, 43 అంగుళాల స్మార్ట్ టీవీల సేల్ నేడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో జరగనుంది.

FOLLOW US: 

రెడ్‌మీ ఇటీవలే రెండు కొత్త స్మార్ట్ టీవీలు మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అవే రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32, స్మార్ట్ టీవీ 43. వీటికి సంబంధించిన సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ టీవీలు కొనుగోలు చేయవచ్చు. ఫ్లాష్ సేల్ ద్వారా వీటిని విక్రయించనున్నారు. ఈ సేల్‌లో వీటిపై పలు ఆఫర్లు కూడా అమెజాన్ అందించింది.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32, రెడ్‌మీ స్మార్ట్ టీవీ 43 ధర
వీటిలో రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32 ధరను మనదేశంలో రూ.15,999గా ఉంది. రెడ్‌మీ స్మార్ట్ టీవీ 43 ధర రూ.25,999గా నిర్ణయించారు. అమెజాన్.కాం, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లలో అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ టీవీ సేల్ జరగనుంది.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32, 43 స్పెసిఫికేషన్లు
ఈ రెండు టీవీల మధ్య ఉన్న ప్రధాన తేడా డిస్‌ప్లేనే. రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32లో 32 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను అందించగా, రెడ్‌మీ స్మార్ట్ టీవీ 43లో 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆధారిత ప్యాచ్‌వాల్ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీలు పనిచేయనున్నాయి. ఐఎండీబీ ఇంటిగ్రేషన్ కూడా ఇందులో అందించారు.

షియోమీ వివిడ్ పిక్చర్ ఇంజిన్ కూడా ఇందులో అందించారు. యూనివర్సల్ సెర్చ్, కిడ్స్ మోర్, లాంగ్వేజ్ యూనివర్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 20W స్పీకర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్:ఎక్స్ సపోర్ట్ ఇందులో ఉంది.

News Reels

కొత్త తరహా ఎంఐ రిమోట్‌ను ఇందులో అందించారు. గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఈ రిమోట్‌లో ఉంది. క్విక్ మ్యూట్ ఫీచర్‌ను ఇందులో కంపెనీ అందించింది. వాల్యూమ్ డౌన్‌కీని డబుల్ ట్యాప్ చేస్తే.. టీవీ మ్యూట్ అయిపోతుంది. ఈ రిమోట్‌లో క్విక్ వేవ్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా టీవీని ఆన్ చేస్తే ఐదు సెకన్లలోనే టర్న్ ఆన్ అవుతుంది. క్రోమ్ కాస్ట్ బిల్ట్‌-ఇన్, ప్రీలోడెడ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌లు కూడా ఇందులో షియోమీ అందించింది. 

డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 వంటి వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ డివైస్‌లను కాస్ట్ చేయడానికి మిరాకాస్ట్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది. టీవీని గేమ్ కన్సోల్‌గా ఉపయోగిస్తున్నప్పుడు లేటెన్సీ రేట్ తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. రెండు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ 2.0, ఒక ఏవీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఎథర్‌నెట్, యాంటెన్నా పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ 32 ఇంచ్‌ను కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
రెడ్‌మీ స్మార్ట్ టీవీ 43 ఇంచ్‌ను కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: ఫర్నీచర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు ఆఫర్లు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Oct 2021 05:50 PM (IST) Tags: Amazon Great Indian Festival Amazon Great Indian Festival Sale Amazon Festival Sale Redmi Smart TV 32 inch Redmi Smart TV 43 inch Redmi New Smart TV Sale

సంబంధిత కథనాలు

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

క్రేజీ డెసిషన్స్‌తో పిచ్చెక్కిస్తున్న మస్క్ మామ - ట్రంప్ బాటలోనే కంగనా కూడా!

క్రేజీ డెసిషన్స్‌తో పిచ్చెక్కిస్తున్న మస్క్ మామ - ట్రంప్ బాటలోనే కంగనా కూడా!

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి