Sister Murder: ఆస్తి కోసం సొంత అక్కనే హత్య చేసిన తమ్ముళ్లు, ఎక్కడంటే?
Sister Murder: ఆస్తి కోసం సొంత అక్కనే పొట్టన బెట్టుకున్నారా సోదరులు. అక్క, బావ, మేనళ్లులపై దాడి సోదరి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sister Murder: రోజురోజుకీ మానవ సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయి. అమ్మ, నాన్న, అక్కా, చెల్లి, అన్నా అనే బంధాలన్నీ బలహీనం అయిపోతున్నాయి. ఎప్పుడు దేని కోసం ఎవరు, ఎవరిని హత్య చేస్తున్నారో కూడూ తెలియదు. ముఖ్యంగా ఆస్తులు కోసం కొందరు, అమ్మాయిల విషయంలో కొందు క్షణికావేశంలో అయిన వాళ్లనే కాటికి పంపిచేస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతున్నాయి. పెళ్లై భర్త, పిల్లలు ఉన్నప్పటికీ... వేరే వాళ్లతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అంతేనా వారి బంధానికి అడ్డుగా ఉంటున్నారని భర్తలనో లేక చిన్న పిల్లలను చంపేస్తున్నారు. లేదంటే భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ఆ భర్తే.. భార్యతో పాటు ఆమె ప్రియుడిని హత్య చేస్తున్నారు.
ఆస్తి కోసం అక్కపై దాడి.. ఆ ముగ్గురు తమ్ముళ్ల అరాచకం!
అయితే తాజాగా ఆస్తి కోసం సొంత అక్కనే చంపేశారా ఓ ముగ్గురు సోదరులు. అయితే ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కొత్తూరులో జరిగింది. అయితే ఆ ముగ్గురు సోదరులకు అలాగే వారి సోదరికి ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయి. ఇదే విషయమై పోలీసుల వద్దకు కూడా వెళ్లారు. పంచాయతీలు కూడా పెట్టించుకున్నారు. కానీ పంచాయతీ వారికి అనుకూలంగా, ఆమోద్య యోగంగా లేకపోవడంతో సోదరిపై కక్ష గట్టారు. ఒక్క సోదరిపై మాత్రమే కాదండోయ్.. ఆమె భర్త, వారి పిల్లలపై కూడా కోపాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే మంగళ వారం రోజు రాత్రి గొడవ పడ్డారు. స్థానికులు ఎంత చెప్పినా వినలేరు.
కత్తులు, గొడ్డళ్లతో అక్క కుటుంబంపైకి..
కత్తులు, కాటార్లతో అక్క, బావ, మేనళ్లుపైకి వెళ్లారు. ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. దీంతో వాళ్లు కూడా ఎదురు దాడడి చేశారు. అయితే ఈ ఘటనలో అక్క పూర్ణిమా బాయి(45) తీవ్రంగా గాయపడింది. ఒక్కసారిగా కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలో గాయపడ్డ వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు పూర్ణిమ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
ఆస్తి తగాదాల కారణంగానే తన తల్లిని.. సొంత మేనమామనే హత్య చేసినట్లు పూర్ణిమ బాయి కుమారుడు తెలిపాడు. గత కొంత కాలంగా వారి మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని.. ఇప్పటికే పోలీసు స్టేషన్ల చుట్టూ, పంచాయతీల చుట్టూ చాలానే తిరిగామని చెప్పారు. పెద్దలు చెప్పిన పంచాయతీ తీర్పు వాళ్లకు నచ్చకపోవడం వల్ల తమ కుటుంబ సభ్యులపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే తాము కూడా ఎదురు దాడికి దిగామని వివరించారు. ఘటనలో తన తల్లి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే పడి మృతి చెందిందిని బావురుమన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.