అన్వేషించండి

వారం రోజుల పాటు మహిళపై అత్యాచారం, వేడి వేడి పప్పు ఒంటిపై పోసి టార్చర్

Delhi Crime News: ఢిల్లీలో మహిళపై బాయ్‌ఫ్రెండ్ వారం రోజుల పాటు అత్యాచారం చేసి నరకం చూపించాడు.

Bengal Woman Abused: ఢిల్లీలో దారుణం జరిగింది. బెంగాల్‌కి చెందిన ఓ మహిళపై బాయ్‌ఫ్రెండ్ వారం రోజుల పాటు అత్యాచారం చేశాడు. అత్యంత రాక్షసంగా ప్రవర్తించాడు. వేడి వేడి పప్పు ఒంటిపై పోసి టార్చర్ చేశాడు. నిందితుడిని ఫిబ్రవరి 2వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్‌బెంగాల్‌లోని డార్జిలింగ్‌కి చెందిన మహిళ దాదాపు నెల రోజులుగా నిందితుడితోనే కలిసి ఉంటోంది. సౌత్ ఢిల్లీలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. జనవరి 30 వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆ రోజే పోలీసులకు ఈ ఘటనకు సంబంధించి ఓ కాల్‌ వచ్చింది. ఓ మహిళను తన భర్త దారుణంగా కొట్టి హింసిస్తున్నాడని స్థానికులు కాల్ చేసి చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు...వెళ్లి ఆ మహిళను రక్షించారు. ఆమె ఒంటిపై 20 గాయాలున్నట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే AIIMSకి తరలించి వైద్యం అందించారు. ఆ తరవాత ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక డిశ్చార్చ్ చేశారు. అయితే..ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్‌లో ఆ యువకుడితో పరిచయం అయిందని ఆ తరవాత ఇద్దరూ కలిసి ఒకే చోట ఉంటున్నామని బాధితురాలు వెల్లడించింది. జనవరి మొదటి వారంలో ఆమె బెంగళూరుకి వెళ్లాల్సి ఉంది. అక్కడే ఓ ఇంట్లో పని మనిషిగా ఉద్యోగం చేసేందుకు వెళ్లాలనుకుంది. ఢిల్లీమీదుగా రైల్ వెళ్తోందని అక్కడే దిగిపోయింది. తన ఫ్రెండ్‌ని కలవాలనుకుంది. అయితే...బాయ్‌ఫ్రెండ్‌ ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఢిల్లీలోనే ఉద్యోగం చూస్తానని తనతోనే ఉండిపోవాలని కోరాడు. అతడి మాటలు నమ్మి అక్కడే ఉండిపోయింది. రోజులు గడిచే కొద్దీ ఆమెని వేధించడం మొదలు పెట్టాడు. అత్యాచారం చేశాడు. వేడి పప్పు ఒంటిమీద పోయడం వల్ల తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget