Banjarahills Drugs Case : ఓటీపీ ఉంటేనే పబ్ లోకి ఎంట్రీ, ఆ జాబితా చెప్పడం కరెక్ట్ కాదు : డీసీపీ జోయల్ డేవిస్
Banjarahills Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల అనుమతి ఉందని చెప్పి పబ్ నడుపుతున్నట్లు డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. మీడియాలో అలా చూపించడం సరికాదన్నారు.
Banjarahills Drugs Case : బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు వివరాలను డీసీపీ జోయల్ డేవిస్ మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... "డ్రగ్స్ అరికట్టకపోతే అది చేయి దాటిపోయే అవకాశం ఉంది. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు చాలా కేసులు కట్టడి చేస్తున్నారు. పబ్స్, బార్స్, రెస్టారెంట్ పై నిఘా పెంచాం. దురదృష్టవశాత్తూ ఈ రోజు ఈ కేసు వెలుగుచూసింది. ఆదివారం తెల్లవారు జామున ఘటన వెలుగు చూసింది. పుడింగ్ అండ్ మింక్ పబ్ లో డాన్స్ ఫ్లోర్ డీజే నడిచింది. ఈ పబ్ లో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం వచ్చింది. తెల్లవారు జామున 2 గంటలకు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో పబ్ పై రైడ్ చేశాం. 20 స్టాఫ్ తో పాటు అక్కడ 148 మంది ఉన్నారు. మొత్తం 96 మంది యువకులు, 38 ఫిమేల్ ఉన్నారు." అని జోయల్ డేవిస్ అన్నారు.
ఓటీపీ ఉంటే పబ్ లోకి అనుమతి
ఈ కేసులో పబ్ యజమాని అర్జున్, మేనేజర్ అభిషేక్, జనరల్ మేనేజర్ అనిల్ అరెస్ట్ చేశామని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. వీరిపై ఎన్డీపీసీ యాక్ట్ పెట్టామన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సీఐ శివ చంద్రను సస్పెండ్ చేశామని ప్రకటించారు. పబ్ లో 148 మందిని వెరిఫై చేశామన్నారు. వారిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయలేదని డీసీపీ చెప్పారు. వీరు డ్రగ్స్ సేవిస్తూ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఓటీపీ ద్వారా లాగిన్ కోడ్ జనరెట్ చేస్తున్నారని, ఓటీపీ ఉంటేనే పబ్ లోకి అనుమతి ఉంటుందన్నారు.
అది కరెక్టు కాదు
గత ఆగస్టు నుంచి పబ్ మేనేజ్ మెంట్ ఛేంజ్ అయిందని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందన్నారు. డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారన్నారు. డేటా అనాలసిస్ ట్యాబ్ సీజ్ చేశామని తెలిపారు. పబ్ జనరల్ మేనేజర్ పోలీసులకు సహకరించలేదన్నారు. గోవా నుంచి డ్రగ్స్ వచ్చినట్లు ఆధారాలు లేవన్నారు. కోకిన్ 5 ప్యాకేట్ లో 5 గ్రాములు ఉన్నాయన్నారు. డ్రగ్స్ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని తెలిపారు. మీడియాలో పబ్ కు వచ్చిన వారి జాబితాను చూపిస్తున్నారని, అది కరెక్ట్ కాదని డీసీపీ అన్నారు. అనుమానం ఉన్న వాళ్ల శాంపిల్స్ తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు. పబ్ కు 24 గంటల అనుమతి ఉందని చెప్పి కస్టమర్లను ఆహ్వానించినట్లు తెలుస్తోందన్నారు. అది నమ్మి చాలా మంది ప్రముఖులు వచ్చినట్లు గుర్తించామన్నారు.