By: ABP Desam | Updated at : 05 Sep 2022 01:37 PM (IST)
రావులపాలెంలో కాల్పుల కలకలం, బ్యాగులో నాటు బాంబులు
Gun firing at Ravulapalem: కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సుపారీ తీసుకుని దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే ఆదిత్య రెడ్డి వారిపై ప్రతిఘటించగా... దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆదిత్య రెడ్డి చేతికి గాయాలు అయ్యాయి. అనంతరం ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. కానీ వారు తెచ్చుకున్న ఓ సంచి అక్కడే పడిపోయింది. ఆ విషయం గుర్తించిన ఆదిత్య రెడ్డి సంచిని తెరిచి చూశారు. అందులో రెండు నాటు బాంబులు, ఓ జామర్ ను చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అసలేం జరిగిందంటే..?
అంబాజీపేటకు మండలం కె.పెదపూడి గ్రామానికి చెందిన బిక్కిన నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు సోదరులకు సుమారు 9 ఎకరాల భూమి ఉంది. వీరికి డబ్బు అవసరం రావడంతో... ఫైనాన్స్ వ్యాపారి సత్య నారాయణ రెడ్డి వద్ద రూ.4.70 కోట్ల అప్పు తీసుకున్నారు. అందుకు పూచీకత్తుగా వారి తొమ్మది ఎకరాల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను అప్పగించారు. వారు చాలా కాలం నుంచి అప్పులు తిరిగి ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే ఆదిత్య రెడ్డి తండ్రి సత్యనారాయణ రెడ్డి సుమారు రెండు నెలల క్రితమే చనిపోయారు. అయితే తండ్రి చనిపోయిన తర్వాత నుంచి వ్యాపారాన్ని ఆదిత్య రెడ్డి చూసుకుంటున్నాడు.
69.50 సెంట్ల భూమి అమ్మకం..
ఈ క్రమంలోనే ఆదిత్య రెడ్డి.. నాగేశ్వర రావు, వెంకటేశ్వర రావులను అప్పు చెల్లించమని కోరాడు. ఎన్ని సార్లు చెప్పినా వాళ్లు స్పందిచకపోవడంతో ఆదిత్య రెడ్డి ఆ భూమిలో కొంత స్థలాన్ని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలోనే 69.50 సెంట్ల భూమిని అదే ప్రాంతానికి చెందిన వారికి అగ్రిమెంట్ చేసిచ్చారు. అయితే అప్పటి నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇదే విషయంలో ఆదిత్య రెడ్డిపై దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని పెట్టి మరీ నిందితుల కోసం గాలిస్తున్నారు.
కరెంట్ షాక్‌తో మామ, అల్లుడు మృతి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ కొట్టడంతో మామ, అల్లుడు మృతి చెందడంతో స్థానికంగా విషాదం జరిగింది. జిల్లాలోని రావులపాలెంలో మామ, అల్లుడు నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో పనులు చేస్తున్నారు. ఒక్కసారిగా ఇద్దరూ ప్రమాదవాశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో మామ ఆర్లప్ప(50), అల్లుడు వెంకట రమణ(35) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులు మన్యం జిల్లా పాపటపల్లి వాసులుగా గుర్తించారు.
Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!
Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!
చిలుక జోస్యం కాదు- సాక్ష్యం చెప్పింది- నిందితులకు శిక్ష పడింది
Hyderabad fire accident: హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం - వ్యక్తి సజీవదహనం
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం