News
News
X

Crime News : ఏపీలో మరో ప్రేమోన్మాదం - కూతుర్నిచ్చి పెళ్లి చేయడం లేదని తల్లీ, కుమార్తెలపై సుత్తితో దాడి !

ఏపీలో మరో ప్రేమోన్మాది కిరాతకంగా వ్యవహరించాడు. కూతుర్నిచ్చి పెల్లి చేయను అన్నారని తల్లీతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలపైనా సుత్తితో దాడి చేశాడు.

FOLLOW US: 
Share:

Crime News :  ఆంధ్రప్రేదశ్‌లో ప్రేమోన్మాదుల దాడులు ఆగడం లేదు. తాజాగా  తూర్పు గోదావరి జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది.  తన ప్రేమను నిరాకరించిందని యువతితో పాటు ఆమె తల్లి, సోదరిపై ప్రేమోన్మాది సుత్తితో దాడి చేశాడు.  కడియం మండలం కడియపులంకలో అర్ధరాత్రి ఇంటికి వెళ్లి సుత్తితో తల్లి, ఇద్దరు కూతుర్లపై ప్రేమోన్మాది దాడి చేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంట‌నే తల్లీ కూతుళ్లను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘాతుకానికి పాల్ప‌డిన యువ‌కుడు పొట్టిలంక‌ గ్రామానికి చెందిన‌ట్లు గుర్తించారు. దాడి అనంతరం యువ‌కుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇత‌డిని కూడా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అర్థరాత్రి గోడ దూకి సుత్తితో దాడి 
 
ప్రేమోన్మాదిని దాసరి వెంకటేష్ గా గుర్తించారు.   పొట్టిలంక గ్రామానికి చెందిన వ్యక్తి.  కడియపులంక గ్రామానికి చెందిన యువతి వెంట కొన్నాళ్లుగా పడుతున్నాడు. అతని తండ్రికి  తండ్రికి ఫోన్ చేసి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని బెదిరిస్తున్నాయి.  పెళ్లి చేయకపోతే మీ  మీ అమ్మాయిని చంపేస్తానని బెదిరిస్తూ వస్తున్నాడు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు భయపడిపోయారు. పోలీసులకు ఫిర్యాదు  చేశారో లేదో స్పష్టత లేదు.  శుక్రవారం అర్ధరాత్రి సుత్తితో దాడి చేయడానికి నేరుగా ఇంటికే వచ్చాడు.   గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన వెంకటేశ్‌.. యువతి తలపై సుత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లి, సోదరిపైనా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. 

తర్వాత  గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సైకో దాసరి వెంకటేష్ 

దాడి చేసిన తర్వాత  వెంకటేశ్‌ తన గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.  యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  నిందితుడిపై హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నం క్రింద కేసు నమోదు చేశారు. అయితే దాసరి వెంకటేష్ ఒక్కడే ఈ నేరం చేయలేదని.. అతని వెంట మరో నలుగురు వచ్చినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారి గురించి ఆరా తీసి.. లఅరెస్ట్ చేసేందుకు ప్రయ.త్నిస్తున్నారు.  రస్తుతం యువతి, ఆమె కుటుంబసభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో, నిందితుడు స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని.. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 

ఏపీలో ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిన ప్రేమోన్మాదుల అరాచకాలు

ఏపీలో ఇటీవలి కాలంలో ప్రేమోన్మాదుల దాడులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఈ నెలలోనే గుంటూరు జిల్లాలో ఓ మెడికల్ విద్యార్థినిని పెళ్లికి నిరాకరించిందని అత్యంత దారుణంగా ఓ సైకో హత్య చేశాడు. అలాంటివి ఏపీ నలుమూలల తరచూ బయటపడుతున్నాయి. ఇలాంటి దాడులు చేసినా ఏమీ కాదనే భరోసాతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లుగా భావిస్తున్నారు. ఇలాంటి ప్రేమోన్మాదులకు కఠిన శిక్షలు పడితేనే నేరం చేయాలనే తలంపులో మార్పు వస్తుందని అంటున్నారు.  అందుకే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. 

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఏదో చేయక్కర్లేదు.. ఈ విషయాలు తెలుసుకుంటే చాలు !

Published at : 24 Dec 2022 02:08 PM (IST) Tags: AP News AP Crime news Hammer Attack Prema Psycho

సంబంధిత కథనాలు

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం

Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!

Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల