అన్వేషించండి

కువైట్ నుంచి వచ్చి కుమార్తెను వేధించిన వ్యక్తి హత్య - పోలీసులేమంటున్నారు?

Murder: కువైట్ నుంచి వచ్చి బంధువును చంపేసి మళ్లీ కువైట్ వెళ్లిపోయాడు అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి. తన కుమార్తెను వేధించినందుకేనని ఆయన వీడియో రిలీజ్ చేశారు.

Annamaiya district Crime News: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులకు ఎవరు చంపారో  అర్థం కాలేదు. దాంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ క్రమంలో కువైట్ లో ఉంటే ఆంజయనేయ ప్రసాద్ అనే వ్యక్తి ఓ వీడియో తీసుకుని పోలీసులకు పంపించాడు. తానే అంజనేయులను చంపేశానని అందులో పేర్కొన్నాడు. దాంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. 

అంజనేయ ప్రసాద్ కుమార్తెను వేధించిన ఆంజనేయలు

ఆంజనేయ ప్రసాద్ తో పాటు ఆయన  భార్య కువైట్‌లో ఉపాధి కోసం ఉంటున్నారు. వారికి పన్నెండేళ్ల కుమార్తె ఉంది. ఆంజనేయ ప్రసాద్ భార్య చంద్రకళ సోదరి లక్ష్మి అదే గ్రామంలో నివాసం ఉంటారు. తాము ఉపాధి కోసం వెళ్తున్నామని చెప్పి చెల్లి వద్ద కుమార్తెను ఉంచారు. అయితే లక్ష్మి మామ .. దివ్యాంగుడైన ఆంజనేయులు ఆ పసిపిల్లపై లైంగిక వేధింపులకు పాల్పుడుతున్నాడు. ఈ విషయం తల్లి ఫోన్ చేసినప్పుడు ఓ సారి చెప్పడంతో ఆమె ఇండియాకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు హెచ్చరికలు జారీ చేసి వదిలేశారు.                                

Also Read: రేప్‌ చేశాడు, జైలుకెళ్లాడు, బెయిల్‌పై వచ్చి బాధితురాలని చంపేశాడు- శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఘాతుకం

తన కుమార్తెకు న్యాయం చేయాలనుకున్న ఆంజనేయ ప్రసాద్

పోలీసుల తీరుతో ఆవేదనకు గురైన  ఆంజనేయ ప్రసాద్‌  ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటని ఆవేదన చెందాడు.  కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. అతను వచ్చిన విషయం .. వెళ్లిన విషయం కూడా ఎవరికీ తెలియదు. దాంతో అతనిపై ఎవరికీ అనుమానం రాలేదు. అనంతరం ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఆడ బిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని.. పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు.                                        

Also Read: విశాఖలో మహిళకు లైంగిక వేధింపులు, సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు

అనుమానాస్పద కేసు హత్యగా మార్చి దర్యాప్తు చేయనున్న పోలీసులు

ఆ తండ్రి చెబుతున్నది నిజమా కాదా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  తన బిడ్డపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని  తల్లి పిర్యాదు చేసిన మాట వాస్తవమేనని చెబుతున్నారు. ఈ విషయంలో కువైట్ లో ఉంటున్న దంపతుల బంధువులు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. మొత్తంగా ఆ తండ్రి తీర్పు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.               

టాప్ హెడ్ లైన్స్

POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget