News
News
వీడియోలు ఆటలు
X

AP Crime News : ఫేక్ లోన్ యాప్ ఆగడాల ఆట కట్టించిన రాజమండ్రి పోలీసులు - ముగ్గురు విదేశీయులు అరెస్ట్ !

ఏపీ పోలీసులు లోన్ యాప్స్ కేసులో ముగ్గురు విదేశీయుల్ని అరెస్ట్ చేశారు. ఓ బాధితుడు ఆత్మహత్య చేసుకోవడంతో కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

FOLLOW US: 
Share:

AP Crime News : ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతి పెద్ద ఫేక్ లోన్ యాప్స్ ముఠా ఆట కట్టించారు. ముగ్గురు విదేశీయుల్ని కూడా అరెస్ట్ చేశారు. లోన్ , గేమింగ్ యాప్స్ పేరుతో కస్టమర్లను ఆకర్షించి తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు  చేస్తున్నారు. మొత్తం ఎనిమిది దేశాల్లో వీరి నేర సామ్రాజ్యం విస్తరించి ఉందని పోలీసులు చెబుతున్నారు. తూ.గో జిల్లా కడియం పోలీస్ స్టేషన్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. మలేషియాలో ఉంటూ.. అక్కడ్నుంచే .. ఇండియాలో ఏజెంట్లను పెట్టుకుని ఫేక్ లోన్ యాప్స్ ను నడుపుతున్నారు. 

ఒక్క సారి లోన్ తీసుకుంటే చచ్చేదాకా కట్టాలని వేధించే లోన్ యాప్స్ 

ఈ లోన్ యాప్స్ ద్వారా ఎవరైనా ఓ పదివేల రూపాయల రుణం తీసుకుంటే వారిని ఈ ముఠా పీల్చిపిప్పి చేస్తుంది. పది వేలకు రూ . లక్ష కట్టినా ఒప్పుకోరు. మార్ఫింగ్ ఫోటోలు.. ఇతర పద్దతుల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి ఎంత కడితే అంత కట్టించుకుంటూనే ఉంటారు. కడియం పోలీసులు దర్యాప్తు చేసిన కేసులో బాధితుడు మే ఐదో  తేదన ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి లోన్ యాప్స్ నిర్వాహకులు, ఏజెంట్ల వేధింపులే కారణం. నిందితుల్ని పట్టుకున్న తర్వాత వారి బ్యాంకు లావాదేవీల్ని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కనీసం కోటి రూపాయల మేరకు రోజుకూ లావాదేవీలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక మంది వీరి బాధితులు ఉన్నట్లుగా గుర్తించారు. 

శరీరాన్ని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో, బకెట్‌లో - మహిళ తల గుర్తింపు కేసులో వణికిపోయే వాస్తవాలు

ముగ్గురు విదేశీయుల్ని ప్రణాళిక ప్రకారం ఇండియాకు రప్పించి అరెస్ట్ 

పోలీసులు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని అసలు సూత్రధారుల్ని ఇండియాకు రప్పించేందుకు ప్రత్యేకమైన పథకం రచించారు. ఏజెంట్ ద్వారా నే వారిని ఇండియాకు వచ్చేలా చేశారు. వారు చెన్నై ఎయిర్ పోర్టులో దిగగానే పోలసులు అరెస్ట్ చేశారు. దీంతో ఫేక్ లోన్ యాప్ నిర్వాహకుల ఆట కట్టినట్లయింది. గేమింగ్ యాప్స్ లోనూ.. పెద్ద ఎత్తున వీరు మోసాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. గ్యారంటీ లేకుండా రుణాలు తక్కువ వడ్డీకి ఇస్తామని యాప్స్ ద్వారానే ఆకర్షించేవారు. రుణం తీసుకున్న వారి కాంటాక్ట్స్ లిస్ట్ మొత్తం అధీనంలోకి తీసుకున్న తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడేవారు. డబ్బులు ఇవ్వని వారి కాంటాక్ట్స్ కు అసభ్యకర సందేశాలు పంపుతూ ఉంటారు. ఈ వేధింపులు  భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.                      

హైదరాబాద్‌లో నయా ఎన్ కౌంటర్ స్పెషలిస్టు ఐపీఎస్‌ రామ్‌- అరెస్టు చేసి లోపలేసిన ఖాకీలు

హవాలా లింకులు కూడా  బట్టబయలు

నిందితులు ప్రతి నెలా యాభై కోట్ల రూపాయల మేర ఫేక్ లోన్ యాప్స్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లుగా గుర్తించారు. ఏజెంట్లకు చెందిన ఇండియా  బ్యాంక్ అకౌంట్స్ ను వాడుకుంటున్నారు. రోజువారీ పద్దతిలో వసూళ్లు చేసి.. ఎప్పటికప్పుడు క్రిప్టో పద్దతిలోకి మార్చి.. విదేశాలకు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. హవాలా ఆపరేటర్లతో వీరి లింకుల్ని పోలీసులు గుర్తించారు. 
    
Published at : 24 May 2023 07:09 PM (IST) Tags: AP Crime news AP Police Fake Loan Apps Loan Apps Case Three Foreigners Arrested in Loan Apps Case

సంబంధిత కథనాలు

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం