అన్వేషించండి

Fake IPS Officer: హైదరాబాద్‌లో నయా ఎన్ కౌంటర్ స్పెషలిస్టు ఐపీఎస్‌ రామ్‌- అరెస్టు చేసి లోపలేసిన ఖాకీలు

Fake IPS Officer: హైదరాబాద్ లో నకిలీ ఐపీఎస్ అధికారిని స్పెషల్ ఆపరేషన్ టీం అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ ఇంఛార్జీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ అధికారి అవతారం ఎత్తి ఎన్ కౌంటర్ స్పెషలిస్టునని చెబుతూ చలామణి అవుతున్న ఓ నిందితుడిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్ అధికారిని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నకలీ ఐపీఎస్‌ను ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన కార్తీక్ అలియాస్ నాగరాజుగా పోలీసులు గుర్తించారు. అయితే స్పెషల్ ఆపరేషన్ టీమ్ సంయుక్తంగా నకిలీ ఐపీఎస్ అధికారిని ఆరెస్ట్ చేసినట్లు మాదాపూర్ ఇంఛార్జీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నాగరాజు అలియాస్ కార్తిక్ పై అనేక నేరాలు ఉన్నాయని.. గతంలో బైక్ దొంగతనంలో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడని పేర్కొన్నారు.

ప్రైవేట్ సెక్యూరిటి ఏజెన్సీలో సైతం ఆతను పని చేసినట్లు గుర్తించారు. గతంలో పోలీస్ ఉద్యోగాల కోసం ట్రై చేశాడని.. కానీ ఎక్కడ కూడా ఉద్యోగం రాలేదని డీసీపీ వెల్లడించారు. ఈ క్రమంలోనే అతడు నకిలీ ఐపీఎస్ అధికారికగా అవతారం ఎత్తినట్లు నమ్మించాడన్నారు. ఆర్మీ లో జాబ్ వచ్చిందని ఊరు, బంధువులను నమ్మించగా.. వారంతా ఇతడిని నమ్మి ఫ్లెక్సీలు సైతం పెట్టినట్లు స్పష్టం చేశారు. 

జార్ఖండ్ నుంచి ఆయుధాలు తీసుకొచ్చి దందాలు

మధుసూదన్ అనే వ్యక్తిని నాగరాజు పోలీసుగా చెప్పుకొని బెదిరించాడని.. ఇదే విషయమై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయ్యిందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గతంలో పీడీ యాక్ట్ కింద కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత మళ్లీ నకిలీ దందాకు పాల్పడినట్లు వ్యాఖ్యానించారు. జార్ఖండ్ నుంచి ఆయుధాలు తీసుకొచ్చి దందా చేసేవాడని.. పోలీస్ అధికారిగా చాలా మందిని విచారించినట్లు కూడా వివరించారు. వారిని చిత్ర హింసలు పెట్టి పెద్ద ఎత్తున డబ్బుసు సంపాధించేవాడని పేర్కొన్నారు.

చాలా మందికి జాబ్ లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడీ నకిలీ ఐపీఎస్‌. రవి శంకర్ అనే వ్యక్తిని ఫేక్ ఎన్ కౌంటర్ చేసినట్లు నమ్మించాడని తెలిపారు. అయితే కార్తీక్ వద్ద నుంచి మెడ్ పిస్టల్ తో పాటు మరో 23 వస్తువులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. 2 లక్షలు విలువజేసే ప్రాపర్టీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. టెక్నీకల్ లో కూడా నాగరాజు బాగా అరితేరాడని.. గవర్నమెంట్ అధికారులతో, ధోనితో ఉన్నట్లు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేశాడని అన్నారు. ఫేక్ కిడ్నాప్ డ్రామాలు ఆడి బాగా డబ్బులు సంపాదించినట్లు వెల్లడించారు. అనేక ఫేక్ ఐడీలు క్రియేట్ చేసినట్లు మాదాపూర్ ఇంఛార్జీ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

Also Read: నకిలీ ఎన్ఐఏ అధికారితో పాటు ఇద్దరు దారి దోపిడీ దొంగల అరెస్ట్

గతేడాది అక్టోబర్ లో నల్గొండలోనూ ఇలాంటి ఘటనే

నల్గొండ జిల్లా అదిసర్లపల్లి మండలం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నార్ల నరేష్ ఇంటర్ వరకు చదివి డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే జల్సాలకు అలావాటు పడ్డాడు. ఎలాగైనా సరే ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం ఓ పథకం వేశాడు. అందులో భాగంగానే ఆర్మీ యూనిఫారం, ఎయిర్ పిస్టల్ తో పాటు నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసుకున్నాడు. గ్రామస్థులందరికీ ఆర్మీలో పని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్నాడు. ఊళ్లోని యువకులకు మర్చంట్ నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఐదుగురు వ్యక్తుల నుంచి ఐదు లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేశాడు. శిక్షణ పేరుతో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని వైష్ణవి కెరియర్ ఫౌండేషన్ లో చేర్పించాడు. తాము మోసపోయినట్లుగా గుర్తించిన సదరు యువకులు.. తల్లిదండ్రులకు విషయం తెలిపారు. దీంతో వారు గొడవ చేయడంతో ఎవరి డబ్బులను వాళ్లకు ఇచ్చేశాడు. ఆ తర్వాత కూడా నిందితుడిలో ఎలాంటి మార్పూ లేదు. ఇటీవల ఎన్ఐఏ అధికారులు దేశంలో పిఎఫ్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇండ్లల్లో తనీఖీలు నిర్వహిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను చూశాడు. తాను కూడా ఎన్ఐఏ అధికారిగా మారి అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. వెంటనే నకిలీ ఐడీకార్డు సృష్టించుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. అంతేకాకుండా కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తు ఎయిర్ పిస్టల్ తో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో జైలుకు పంపిస్తానని బెదిరించిన సంఘటలో బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నకిలీ ఎన్ఐఏ అధికారిని పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి ఆర్మీ యూనిఫారంతో పాటు ఎయిర్ పిస్టల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఇతను పదోక్లాసు ఫెయిల్, కానీ డాక్టర్! పదేళ్ల నుంచి ఇదేపని - ఎలా సాధ్యమైందంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP DesamSRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP DesamPinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Iswarya Menon Photos:  పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Iswarya Menon Photos: పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Supreme Court  : చంద్రబాబు  బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - ఏప్రిల్ 16న మళ్లీ విచారణ !
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - ఏప్రిల్ 16న మళ్లీ విచారణ !
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
Embed widget